అన్నంపెట్టే రైతులు ఇలా.. ఏమిదొరా నీవల్ల ఉపయోగం: కేసీఆర్ కు వైఎస్ షర్మిల చురకలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా కేసీఆర్ పై మండిపడిన వైయస్ షర్మిల భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సీఎం కేసీఆర్ కు ప్రశ్నాస్త్రాలు సంధించారు.

ఏ ఒక్క రైతునైనా ఆదుకున్నావా కెసిఆర్ : వైఎస్ షర్మిల

ఏ ఒక్క రైతునైనా ఆదుకున్నావా కెసిఆర్ : వైఎస్ షర్మిల

కెసిఆర్ రైతులను ఆదుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు అని ప్రశ్నించిన వైయస్ షర్మిల మునిగిపోయే కాళేశ్వరానికి లక్షల కోట్లు అప్పు తెచ్చిపెట్టొచ్చు కానీ, అన్నం పెట్టే రైతును ఆదుకోవడానికి పైసల్ లేవా? కెసిఆర్ అంటూ ఆయనను నిలదీశారు. వానలకు, వరదలకు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతులు..ఆదుకోవాల్సిన సర్కార్ ఆసరా లేదనిఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాయం చేస్తామని ప్రకటనలు తప్ప ఒక్క పైసా అయినా ఇచ్చావా?

సాయం చేస్తామని ప్రకటనలు తప్ప ఒక్క పైసా అయినా ఇచ్చావా?


రైతులు ప్రాణాలు తీసుకోకుండా ఏ ఒక్క రైతునైనా ఆదుకొన్నావా కెసిఆర్ అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వరదలకు ఇండ్లు మునిగిపోయి, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులకు సాయం చేసావా? అంటూ వైఎస్ షర్మిల కెసిఆర్ పై అసహనం వ్యక్తం చేశారు. వరద బాధితులకు 10వేల రూపాయల సాయమని ప్రకటనలు చేసి వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు పైసా అన్న ఇచ్చావా? వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు పంటల బీమా చేయడం చేతకాదని మండిపడ్డారు.

ఏమిదొరా నీవల్ల ఉపయోగం... కేసీఆర్ ను ప్రశ్నించిన షర్మిల

ఏమిదొరా నీవల్ల ఉపయోగం... కేసీఆర్ ను ప్రశ్నించిన షర్మిల


నష్టపోయిన రైతులను ఆదుకోవడం చేతకాదు, వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడం చేతకాదు అంటూ నిప్పులు చెరిగారు. ఏమిదొరా నీవల్ల ఉపయోగం అంటూ ప్రశ్నించిన వైయస్ షర్మిల కెసిఆర్ పట్టింపులేని తనాన్ని టార్గెట్ చేశారు. సీఎం కెసీఆర్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. ఇక వరదల ముంపుకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రాజెక్ట్ ల నిర్మాణంపై అవగాహన లేకపోవటం కారణం అని షర్మిల అసహనం వ్యక్తం చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన వైఎస్ షర్మిల .. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆగ్రహం

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన వైఎస్ షర్మిల .. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆగ్రహం


ఇప్పటికే వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజల వాస్తవిక పరిస్థితులను తెలుసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వరద బాధితులకు అండగా ఉంటుందని వైయస్ షర్మిల హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణం వరద ప్రభావిత ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం అందించాలని సూచించిన వైయస్ షర్మిల, ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన కురిసినట్టు అందంగా ఉంటుంది అంటూ నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను, ప్రజలను పట్టించుకోవడం లేదంటూ తనదైన శైలిలో నిత్యం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+