వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కుర్చీ వేసుకుని కట్టించావా కేసీఆర్: వైఎస్ షర్మిల సూటిప్రశ్న

|
Google Oneindia TeluguNews

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్న వైయస్ షర్మిల పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ చేసింది శూన్యం అంటూ ధ్వజమెత్తారు. నార్లాపూర్ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్ వద్ద పాలమూరు నీళ్ల పోరు ధర్నా నిర్వహించిన వైయస్ షర్మిల కెసిఆర్ సర్కార్ ను తూర్పారబట్టారు.

ప్రాజెక్ట్ వద్ద కుర్చీ వేసుకుని దగ్గరుండి కట్టిస్తానన్నావ్.. ఏమైంది కేసీఆర్

ప్రాజెక్ట్ వద్ద కుర్చీ వేసుకుని దగ్గరుండి కట్టిస్తానన్నావ్.. ఏమైంది కేసీఆర్

కెసిఆర్ కు పాలమూరు జిల్లాపై ప్రేమ లేదని వైయస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం అక్కడినుండి మొదలైనదన్న షర్మిల రాష్ట్రం వచ్చిన తర్వాత వలసల జిల్లా పాలమూరుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నా ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఆ పని చేయలేదని మండిపడ్డారు. ప్రాజెక్టు పనులపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చుని, దగ్గరుండి ప్రాజెక్టు కట్టిస్తానని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన వైయస్ షర్మిల, కెసిఆర్ మాటలు కోటలు దాటుతాయి కాని పనులు గడప దాటవు అంటూ ఎద్దేవా చేశారు.

బీజేపీతో రాసుకుపోసుకు తిరిగినప్పుడు అనుమతులు తెచ్చుకోకుండా ఏం చేశావు

బీజేపీతో రాసుకుపోసుకు తిరిగినప్పుడు అనుమతులు తెచ్చుకోకుండా ఏం చేశావు

గతంలో బీజేపీతో రాసుకుపూసుకు తిరిగి ప్రాజెక్టుకు అనుమతులు ఎందుకు తెచ్చుకోలేక పోయారని వైయస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక శంకుస్థాపన చేసిన తొలి ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి అని పేర్కొన్న వైయస్ షర్మిల ఎనిమిదేండ్లుగాకమీషన్లు దోచుకుంటున్నారు తప్ప ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయడం లేదు అంటూ మండిపడ్డారు. వలసల జిల్లాను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని నిప్పులు చెరిగారు. పాలమూరు జిల్లా అంటే కేసీఆర్ కు చిన్న చూపు అని, అందుకు నిదర్శనమే ఎనిమిది సంవత్సరాలుగా ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం అని షర్మిల ఎద్దేవా చేశారు.

కమీషన్లు దండుకోవటం తెలుసు కానీ పనులు చెయ్యటం తెలియదా

కమీషన్లు దండుకోవటం తెలుసు కానీ పనులు చెయ్యటం తెలియదా


కెసిఆర్ కు చేతకాకనే కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీతో దోస్తీ చేసినప్పుడు ప్రాజెక్టు గురించి ఎందుకు తేల్చుకోలేదో చెప్పాలన్నారు ప్రాజెక్టు మీటింగ్ కు ఎందుకు డుమ్మా కొట్టారు అంటూ వైఎస్ షర్మిల నిలదీశారు. ప్రాజెక్టు వ్య‌యం పెంచి, క‌మీష‌న్లు దోచుకోవ‌డం తెలుసు కానీ ప‌నులు చేయ‌డం తెలియదా? అంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరును దత్తత తీసుకుంటానని దొంగ మాటలు కూడా చెప్పావ్ అన్న వైయస్ షర్మిల ఎనిమిదేండ్లలో కృష్ణా నది మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టావా? పాలమూరులో ఒక్క ఎకరానికైనా నీళ్లు అందించావా? పాలమూరు ద్రోహి కెసిఆర్ అంటూ నిప్పులు చెరిగారు. ఒకపక్క కాళేశ్వరం ప్రాజెక్టు పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే మరోపక్క పాలమూరు-రంగారెడ్డి విషయంలోనూ సీఎం కేసీఆర్ ను తూర్పారాబట్టారు వైఎస్ షర్మిల.

English summary
YS Sharmila asked what KCR did to Palamuru and targeted KCR. Remembering KCR's words.. sharmila under fire as to why Palamuru Rangareddy project has not been completed yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X