కమాన్.. నేను రెడీ.. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యండి: వైఎస్ షర్మిల సవాల్
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సర్కారు తీరుపై, టిఆర్ఎస్ మంత్రుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే వైయస్ రాజశేఖర్ రెడ్డి హత్యకు కుట్ర చేశారని, తనను కూడా హతమార్చడం కోసం కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించిన వైయస్ షర్మిల, తాజాగా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చర్యలు తీసుకోనున్నారని వస్తున్న వార్తలపై స్పందించారు.

మంత్రిపదవిలో ఉన్న వ్యక్తి మరదలు అని అవమానిస్తే కేసు పెట్టారా?
షాద్ నగర్ లో పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల మరోమారు పాలమూరు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నమోదైన ఎఫ్ ఐ ఆర్, అరెస్టు ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిల బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మహిళను పట్టుకుని మరదలు అవమానకరంగా మాట్లాడినా కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. తానే స్వయంగా వెళ్లి కేసు పెట్టినా, మంత్రిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

ప్రజల మద్దతు వస్తుందనే పాలమూరు ఎమ్మెల్యేల కుట్రలు
పోలీసులకు తనకు జరిగిన అవమానం కనిపించటం లేదా అని మండిపడ్డారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తనపైన కేసులు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. పాలమూరు ఎమ్మెల్యేలందరూ కట్టగట్టుకుని వెళ్లి తనపై అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారని, తనకు ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేక ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తన పాదయాత్రను ఆపాలనే ఇదంతా
రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తన పాదయాత్రను ఆపడం కోసం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న కుట్ర అని తాజా పరిణామాలను ఉద్దేశించి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఎక్కడ వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైయస్ షర్మిల పాదయాత్ర కొనసాగిస్తే తమ బండారం బయటపడుతుందో అని భయపడుతున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆఫ్ఘనిస్తాన్ లా మారిందని, రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన తాలిబన్ల పాలనలా అనిపిస్తుందని వైయస్ షర్మిల మండిపడ్డారు.

దమ్ముంటే తనను అరెస్ట్ చెయ్యాలన్న వైఎస్ షర్మిల
మీకు దమ్ముంటే తన పాదయాత్రను ఆపాలని వైయస్ షర్మిల సవాల్ చేశారు. ఎలా ఆపుతారో నేను చూస్తాను అంటూ వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. ఒక మంత్రి మరదలు అని తనను అవమానిస్తే ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు తనను ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తానంటూ వైయస్ షర్మిల పేర్కొన్నారు. కమాన్ నేను రెడీ... దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ ఛాలెంజ్ చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను పాదయాత్ర చేసి తీరుతానని వైయస్ షర్మిల తేల్చిచెప్పారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications