వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే ముసుగులో కాంట్రాక్టర్.. చల్లా ధర్మారెడ్డి మనిషా.. పశువా? వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను సాగిస్తున్న వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరింది. ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ప్రస్తావించడంతో పాటుగా, స్థానిక ఎమ్మెల్యేల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా పరకాల నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైయస్ షర్మిల పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్యే ముసుగులో ఉన్న కాంట్రాక్టర్ చల్లా ధర్మారెడ్డి: వైఎస్ షర్మిల

ఎమ్మెల్యే ముసుగులో ఉన్న కాంట్రాక్టర్ చల్లా ధర్మారెడ్డి: వైఎస్ షర్మిల


పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కాదు, అధర్మారెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల, చల్లా ధర్మారెడ్డి అక్షరాల 5వేల కోట్లు సంపాదించాడట అంటూ ఆరోపించారు. ఎమ్మెల్యే ముసుగులో ఉన్న కాంట్రాక్టర్ అని విమర్శించారు. చిన్నవైనా, పెద్దవైనా అన్ని కాంట్రాక్ట్ లు తానే చెయ్యాలని, తానే సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భూకబ్జాలకు పాల్పడి భూబకాసురుడయ్యాడని విమర్శలు గుప్పించారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా నడిపిస్తూ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాడని చల్లా ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఎమ్మెల్యేకు కర్రుకాల్చి వాత పెట్టాలి: వైఎస్ షర్మిల

అవినీతిని ప్రశ్నించిన మా పార్టీ కార్యకర్తలను జైలులో పెట్టించాడట. సిగ్గుండాలి కదా? అంటూ వైయస్ షర్మిల చల్లా ధర్మారెడ్డి ని టార్గెట్ చేశారు. చల్లా ధర్మారెడ్డి అధికారమదంతో వైయస్ఆర్ విగ్రహాన్ని కూల్చాడన్న వైయస్ షర్మిల. ఈయన మనిషా? పశువా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితులు, బీసీలంటే ఈయనకు లెక్కే లేదని చల్లా ధర్మారెడ్డిని విమర్శించారు. దళిత ఉద్యోగుల పట్ల ఇంగితం లేకుండా మాట్లాడతారని నిప్పులు చెరిగారు. చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంలో మోనార్క్ లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై ఈ ఎమ్మెల్యేకు కర్రుకాల్చి వాత పెట్టాలి అని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

జయశంకర్ సార్ సొంతూరును ఆదర్శ గ్రామమన్న కేసీఆర్ ఏం చేసారు

జయశంకర్ సార్ సొంతూరును ఆదర్శ గ్రామమన్న కేసీఆర్ ఏం చేసారు


ఇక అంతే కాదు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ సొంతూరును కేసీఆర్ కనీసం పట్టించుకోలేదని వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ పై గౌరవం ప్రదర్శిస్తున్న కెసీఆర్ గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారని, స్మృతి వనం ఏర్పాటు చేస్తామన్నారని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారని, ఆఖరికి మంచినీళ్లు, రోడ్లు కూడా లేకుండా చేశారని సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.

కేసీఆర్ ది దొరల, దొంగల ప్రభుత్వం అన్న వైఎస్ షర్మిల

కేసీఆర్ ది దొరల, దొంగల ప్రభుత్వం అన్న వైఎస్ షర్మిల


అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఇది దొరల, దొంగల ప్రభుత్వం అని షర్మిల నిప్పులు చెరిగారు. పోలీసులను జీతగాళ్లుగా వాడుకొని దోపిడీలకు పాల్పడుతోందని వైయస్ షర్మిల విమర్శించారు. డబ్బులు సంపాదించుకోవడానికే ఈ ప్రభుత్వం ఉందని అభిప్రాయపడ్డారు. బంగారు తెలంగాణ అని పేదవారికి బతుకే లేని తెలంగాణగా మార్చారని వైయస్ షర్మిల మండిపడ్డారు. కెసిఆర్ దొరల ప్రభుత్వం పోవాలి, వైయస్సార్ సంక్షేమ పాలన రావాలని, ఆ పని ప్రజలు చేయాలని వైయస్ షర్మిల పేర్కొన్నారు.

కరీంనగర్లో గంగుల రౌడీ రాజ్యం.. బండి సంజయ్ నూ వదిలిపెట్టని వైఎస్ షర్మిల!!కరీంనగర్లో గంగుల రౌడీ రాజ్యం.. బండి సంజయ్ నూ వదిలిపెట్టని వైఎస్ షర్మిల!!

English summary
YS Sharmila, targeted with extreme comments on MLA Challa Dharma reddy, said that he was a contractor in the guise of an MLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X