దొరగారికి అమ్ముకోవడం మీదున్న శ్రద్ధ పేదలకు ఇళ్ళు కట్టించడంలో లేదు: వైఎస్ షర్మిల చురకలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చటం కోసం ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదని ఆమె విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ నిరుపేదలకు ఇల్లు కట్టి ఇవ్వాల్సిన భూములను అమ్ముకుంటున్నాడు అంటూ ఆరోపించారు.

వైఎస్సార్ నిరుపేదల ఇళ్ళ కోసం ఇచ్చిన భూములు కేసీఆర్ అమ్ముకుంటున్నాడు
మధ్యతరగతి ప్రజలు మోసపోవద్దని, రియల్ ఎస్టేట్ ధరల నుంచి రక్షణ కల్పించాలని నాడు వైయస్సార్ సంకల్పించారని, పేదప్రజల సొంతింటి కలను నెరవేర్చాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇండ్ల నిర్మాణం కోసం భూములను సేకరించి 2007లో రాజీవ్ స్వగృహ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నేడు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాల్సిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ భూములను అమ్ముకొని కోట్లు కూడగట్టుకుంటున్నాడు అంటూ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చే నాథుడే లేడు అంటూ మండిపడ్డారు.

దొరగారికి అమ్ముకోవడం మీదున్న శ్రద్ధ ఇండ్లు కట్టించడంలో లేదు
తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం విక్రయిస్తున్న ఈ భూముల్లో ఎంతోమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వచ్చు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కానీ దొరగారికి అమ్ముకోవడం మీదున్న శ్రద్ధ ఇండ్లు కట్టించడంలో లేదు అంటూ ఎద్దేవా చేశారు. పేదప్రజల ఆస్తులు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకొంటున్న చేతగాని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై వైఎస్ షర్మిల తెలంగాణా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యపై, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలపై సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వైయస్ షర్మిల నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణా నిరుద్యోగుల కోసం, రైతుల కోసం పోరాటం చేస్తున్న షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రైతుల సమస్యలపై, తెలంగాణ రాష్ట్రంలో పత్తి, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తున్న వైయస్ షర్మిల, సీఎం కేసీఆర్ ను రైతు సంక్షేమం విషయంలో నిలదీస్తున్నారు. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉన్న కేసీఆర్ ఆ బాధ్యతను విస్మరించి ప్రగతి భవన్ కే పరిమితం అవుతున్నారు అంటూ, ఫాంహౌస్లో గడుపుతున్నారు అంటూ వైయస్ షర్మిల కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు.

కెసిఆర్ దేశాన్నిఏలితే అందరూ ఆత్మహత్య చేసుకోవాల్సిందే
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న షర్మిల, తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజల పక్షాన తను పోరాటం సాగిస్తానని చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోని సమస్యలను పక్కనపెట్టి, రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నా, ఆత్మహత్యలకు పాల్పడుతున్నా అవేవీ పట్టనట్టు జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేయడం పైన కూడా వైఎస్ షర్మిల మండిపడుతున్నారు. కెసిఆర్ దేశాన్నిఏలితే అందరూ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితే అంటూ తేల్చి చెబుతున్నారు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, అంతే పదునుగా, తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా వైయస్ షర్మిల చెబుతున్న తీరు ఆసక్తికరమనే చెప్పాలి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications