హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

YS Sharmila: లోటస్‌పాండ్‌లో మళ్లీ సందడి: సన్నాహక సమావేశాలు షురూ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పార్టీని నెలకొల్పబోతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. ఆ దిశా మరోో అడుగు ముందుకేయనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న ఆమె.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జులై 8వ తేదీన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) జెండాను ఆవిష్కరించనున్నారు. పార్టీ విధి విధానాలను వెల్లడించనున్నారు.

Recommended Video

#TopNews : AP Exams - ప్రభుత్వానికి ,పేరెంట్స్ కి మధ్య Communication Gap | Oneindia Telugu

కోరికలు కలిగించే ఇంజెక్షన్లు ఇస్తూ..ఎనిమిదేళ్లుగా బాలికపై రేప్: మహిళ సహాకోరికలు కలిగించే ఇంజెక్షన్లు ఇస్తూ..ఎనిమిదేళ్లుగా బాలికపై రేప్: మహిళ సహా

దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాలను వైఎస్ షర్మిల ఇవ్వాళ చేపట్టనున్నారు. అన్ని జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఈ భేటీ ఆరంభం కానుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని లోటస్‌ పాండ్ నివాసంలో ఈ విస్తృతస్థాయి ఏర్పాటుకానుంది. అన్ని జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు ఇందులో పాల్గొంటారు. మండలాలు, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తారు. పార్టీ పేరును ప్రకటించిన తరువాత.. దాన్ని క్షేత్రస్థాయిలో ఎలా తీసుకెళ్లాలనే విషయంపై పార్టీ నేతల అభిప్రాయాన్ని సేకరిస్తారు.

YS Sharmila to conduct meeting with key leaders at her lotus pond residence today

పార్టీ ఆవిర్భావ ప్రకటన, చేరికలు, పాదయాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్ ఇవన్నీ ఈ విస్తృతస్థాయి సమావేశంలో చర్చకు రానున్నాయి. పార్టీలో చేరికల విషయం ఆచితూచి వ్యవహరించాలని షర్మిల అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అంకితభావాన్ని కనపరిచే వారిని ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఉద్యమిస్తోన్న వైఎస్ షర్మిల.. గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటోన్న ఇతర సామాజికాంశాలపైనా పోరాడుతారని, పాదయాత్ర చేపట్టడం ద్వారా ఆయా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారని పార్టీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.

English summary
A head of Party name announcement in July 8, YS Sharmila to conduct meeting with key leaders at her lotus pond residence in Hyderabad today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X