వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ప్రభుత్వం పై విజయమ్మ కీలక వ్యాఖ్యలు - సవాల్..!!

|
Google Oneindia TeluguNews

వైఎస్ విజయమ్మ తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసారు. కుమార్తె షర్మిల పాదయాత్రలో విజయమ్మ పాల్గొన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర తో తెలంగాణ ప్రభుత్వంలో అలజడి మొదలైందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్టీపి అధినేత్రి షర్మిల చేస్తున్న పాదయాత్ర 3,500 కీలో మీటర్లకు చేరింది. దీంతో, విజయమ్మ నర్సంపేటలో పైలాన్ ఆవిష్కరించారు. గొప్ప ఆశయం..సంకల్పంతో ఈ యాత్ర సాగుతోందని అభినందించారు. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోందని చెప్పుకొచ్చారు.

YS Vijyamma interesting comments against TRS Govt, says Sharmila stands for poor people

షర్మిల పదేళ్ల కిందట..ఇప్పుడు ఇలా
ఒక మహిళ పదేళ్ల కిందట 3,200 కిలో మీటర్లు నడించిందని..ఈ మహిళే ఇప్పుడు మళ్లీ 3,500 కిలో మీటర్లు నడిచారని విజయమ్మ చెప్పుకొచ్చారు. పరోక్షంగా నాడు అన్న జగన్ కోసం చేసిన పాదయాత్రను విజయమ్మ గుర్తు చేసారు.షర్మిల పాదయాత్ర దేశ చరిత్రలో ఒక రికార్డుగా పేర్కొన్నారు. తల్లిగా తనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. షర్మిల దివంగత సీఎం వైఎస్సార్ కు గారాల పట్టి అని గుర్తు చేసారు. వైఎస్సార్ తరువాత రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. ప్రతీ చోటా వైఎస్సార్ ను గుర్తు చేస్తున్నారని వివరించారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ గుడి కట్టుకున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో సంక్షేమం, సమన్యాయం లేవని విజయమ్మ వ్యాఖ్యానించారు.

YS Vijyamma interesting comments against TRS Govt, says Sharmila stands for poor people

దమ్ముంటే షర్మిలతో పాదయాత్ర చేయండి
ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయన్నారు. దీని కారణంగా ప్రశ్నించే నాయకురాలిగా షర్మిల ప్రజల ముందుకు వచ్చారని చెప్పారు. షర్మిల ఆందోళన చేస్తుంటే మంగళవారం వ్రతాలు అని హేళన చేస్తున్నారన్నారు. షర్మిల తెలంగాణలో ఒక ప్రభంజనంలా మారుతున్నారని, దమ్ముంటే షర్మిలతో ఒక రోజు పాదయాత్రకు రావాలని సవాల్ చేసారు. రాబోయే ఎన్నికల కు సమరశంఖం పూరించాలని సూచించారు. షర్మిలకు ప్రజలు మద్దతుగా నిలబడి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలని విజయమ్మ పిలపునిచ్చారు.

వైసీపీ వ్యవహారాలకు దూరంగా
వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా పార్టీ ప్లీనరీలో ప్రకటించిన విజయమ్మ, ఆ సమయంలోనే తాను షర్మిలకు అండగా నిలవాల్సిన అవసరాన్ని వివరించారు. తన ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల కోసం కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఆ నిర్ణయం తరువాత విజయమ్మ వైఎస్సార్ అవార్డుల ప్రధానోత్సవం, ప్రత్యేక సందర్భాల్లో మినహా వైసీపీ వ్యవహారాల్లో కనిపించటం లేదు. షర్మిల పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో నాడు ఏపీలో షర్మిల జగన్ కు మద్దతుగా ప్రజల్లోకి వెళ్లేందుకు చేసిన పాదయాత్రను గుర్తు చేసారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పైన విజయమ్మ చేసిన కీలక వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

English summary
YS Vijayamma crucial comments on TRS Govt and oppostion parties in the state, ask the public to support Sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X