తెలంగాణను వైఎస్ అడ్డుకున్నారు, నేను సాక్షిని: మన్మోహన్ మీడియా సలహాదారు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన వద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన డాక్టర్ సంజయ బారు సంచలన ప్రకటన చేశారు. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వైయస్ రాజశేఖర రెడ్డి అడ్డుకున్నారని ఆయన చెప్పారు.
"అది నిజం. వైఎస్, మన్మోహన్ మధ్య సమావేశం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నా" అని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే అటు కోస్తాంధ్రలో గానీ ఇటు తెలంగాణలో గానీ కాంగ్రెసు విజయం సాధించదని వైఎస్ మన్మోహన్‌తో చెప్పినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ఇస్తే కోస్తాంధ్ర ప్రజలు ఆగ్రహంతో మనకు ఓట్లు వేయబోరని, తెలంగాణలో క్రెడిట్ కెసిఆర్‌కు ఇస్తారని, మనకు ఓట్లు వేయరని వైఎస్ చెప్పినట్లు సంజయ బారు చెప్పారు. మోడడీ, మీడియా అనే అంశంపై జరిగిన సమావేశంలో శుక్రవారంనాడు ఆయన మాట్లాడుతూ ఆ విషయాలు వెల్లడించారు.
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చాలా మందికి అందనంత దూరంలో ఉన్నారని, తన ప్రత్యర్థులు చేరుకోలేనంత దూరంలో ఉన్నారని, అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేయాల్సే ఉందని ఆయన అన్నారు.

రుజవైంది...
వైఎస్ మాటలు రుజువయ్యాయని, తెలంగాణ ఇస్తే కాంగ్రెసుకు ప్రయోజనం ఉండదని వైయస్ భావించారని సంజయ బారు చెప్పారు.

అది నిజమే...
వైఎస్ మాటలు నిజమని తేలిందని, అయితే రాష్ట్ర విభజన వల్ల ఎపి లేదా తెలంగాణ ప్రయోజనం పొందుతాయా అనేది వేరే విషయమని ఆయన అన్నారు.

మంచిదా, చెడ్డదా...
ఢిల్లీ దృష్టిలో రాష్ట్ర విభజన చెడ్డదా, మంచిదా అనే ప్రశ్నకు సంజయ బారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనను తీసుకుని వివరించారు.

చంద్రబాబు ఇలా...
నిన్న సాయంత్రం (గురువారం సాయంత్రం) తాను టెలివిజన్ చూస్తున్నానని, రాజ్‌నాథ్, జైట్లీలను చంద్రబాబు కలిసిన దృశ్యాలను చూశానని ఆయన చెప్పారు.

కుర్చీ అంచున...
చంద్రబాబు కుర్చీ అంచున కూర్చోగా, జైట్లీ, రాజ్‌నాథ్ కుర్చీల్లో దర్జాగా కూర్చోవడం కనిపించిందని, ఢిల్లీ అధికారాన్ని గౌరవిస్తుందని చెప్పారు.

వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు
వాజ్‌పేయి ప్రధానిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుటి మాదిరిగా ఉంటుందని తాను అనుకోవడం లేదని, సంఖ్యను బట్టి అధికారం వస్తుందని, హిందీయేతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రంగా ఉండేదని సంజయ బారు అన్నారు.












Click it and Unblock the Notifications