ఇలాగైనా కలిసొస్తుందేమో- షర్మిల లోటస్ పాండ్ ఇంట్లో వాస్తు మార్పులు..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే జిల్లాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. కలెక్టరేట్లు, పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్‌లతో పాటు పార్టీ కార్యాలయాలనూ ప్రారంభిస్తోన్నారు. ఇక ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం కేసీఆర్ ఇప్పటి నుంచే సమాయాత్తమౌతోన్నారు. ఎక్కడికక్కడ వరాలను ప్రకటిస్తోన్నారు.
అటు కాంగ్రెస్, భారతీయ జనత పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణలో పర్యటించారు. బహిరంగసభను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఆమె బాధ్యతలను సైతం వెనుకాడట్లేదు. బీజేపీ తరఫున కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 15వ తేదీన తెలంగాణలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ.. అది రద్దయింది.

ఇక వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఏమీ ఉండట్లేదు. అన్ని పార్టీలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటోండగా.. దీనికి భిన్నంగా వైఎస్ఆర్టీపీలో కొంత స్తబ్దత ఏర్పడింది. గతంలో ప్రజా ప్రస్థానం పేరుతో రాష్ట్రంలో 3,800 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు షర్మిల. క్షేత్రస్థాయిలో సమస్యలో ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలు, స్థానిక రాజకీయాలపై అవగాహన ఏర్పరచుకున్నారు.
దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేలో పనిలో నిమగ్నం అయ్యారామె. మేనిఫెస్టో రూపకల్పనపై షర్మిల ప్రస్తుతం కసరత్తు చేస్తోన్నారని తెలుస్తోంది. వచ్చే నెల రెండో వారంలో ఆమె మరో విడత జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వెలువడేంత వరకూ జనంలో ఉండేలా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోన్నట్లు చెబుతున్నారు.
YSR తెలంగాణ పార్టీ కార్యాలయంలో భారీగా వాస్తు మార్పులు#YSSharmila #YSRTP #YSRTelanganaParty #TelanganaPolitics #Oneindiatelugu pic.twitter.com/BrpZFCRYK4
— oneindiatelugu (@oneindiatelugu) June 14, 2023
కాగా- తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోటస్‌పాండ్‌లోని నివాసంలో భారీగా మార్పులు చేర్పులకు షర్మిల పూనుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఈ మార్పులు చేస్తోన్నారు. పార్టీని విస్తరించే క్రమంలో చేస్తోన్న శ్రమకు, అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుందని భావిస్తోన్న షర్మిల- పార్టీ కార్యాలయాన్ని వాస్తుకు అనుకూలంగా మార్చితే బాగుంటుందని భావించారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు మార్పులు చేపట్టారు.












Click it and Unblock the Notifications