హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

7 గంటల పాటు హడల్: చిరుత పులిని వల వేసి పట్టారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్: తెలంగాణలోని మెదక్‌ జిల్లాలో ఓ చిరుత పులి హడలెత్తించింది. తుక్కాపూర్‌లో అది ఎనిమిది మంది పైన దాడి చేసింది.

అనంతరం అధికారులు దానిని పట్టుకొని అభయారణ్యానికి తరలించారు. కొల్చారం మండలం తుక్కాపూర్‌లో మంగళవారం ఆ చిరుత స్వైరవిహారం చేసింది.

పలువురి పైన చిరుత పులి దాడి చేసి గాయపరిచింది. గ్రామంలో ఏడు గంటల పాటు ప్రజలను భయాందోళనలో ఉంచింది.

చిరుత పులి

చిరుత పులి

తెలంగాణలోని మెదక్‌ జిల్లాలో ఓ చిరుత పులి హడలెత్తించింది. తుక్కాపూర్‌లో అది ఎనిమిది మంది పైన దాడి చేసింది.

చిరుత పులి

చిరుత పులి

మంగళవారం ఉదయం బాలయ్య ఇంట్లోకి ప్రవేశించిన చిరుత అతని భార్య బుజ్జమ్మను గాయపరిచింది. పక్కనే ఉన్న శంకరయ్య, అతని కుమారులు యాదయ్య, మల్లేశం కర్రలతో చిరుతను తరిమేందుకు ప్రయత్నించారు.

చిరుత పులి

చిరుత పులి

వారి పైనా దాడికి దిగింది. గాయపడినా వారు దానిని అటకాయించడంతో పొదల్లో దూరి గంటన్నరపాటు అక్కడే ఉంది.

చిరుత పులి

చిరుత పులి

పరిసర గ్రామాల ప్రజలు తుక్కాపూర్‌కు చేరుకున్నారు. చిరుత దాగివున్న ప్రాంతంలో గాలిస్తుండగా అది పొదల్లోంచి బయటకొచ్చి మరో నలుగురిని గాయపరిచింది.

చిరుత పులి

చిరుత పులి

రంగంపేటకు చెందిన పోచయ్యను కొంతదూరం ఈడ్చుకెళ్లింది. తుక్కాపూర్‌కు చెందిన ఆయిలి రాములు, దోడ్ల శ్రీశైలం, పైతరకు చెందిన పాపయ్యలనూ గాయపరచింది.

చిరుత పులి

చిరుత పులి

దీంతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు. అనంతరం చిరుత ఆయిలి కేశయ్య పశువుల పాకలో దూరింది.

చిరుత పులి

చిరుత పులి

మెదక్‌ ఆర్డీవో, డీఎఫ్‌వోలు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత దాగివున్న పాక చుట్టూ వలలను ఏర్పాటు చేయించారు.

చిరుత పులి

చిరుత పులి

గ్రామస్థులూ మరికొన్ని వలలను గుడిసె చుట్టూ కట్టి టపాకాయలు పేల్చారు. దీంతో బయటకు వచ్చిన చిరుత వలలో చిక్కింది.

చిరుత పులి

చిరుత పులి

హైదరాబాద్‌ జూపార్కు వైద్యాధికారి వెంకట్రావ్‌ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దానిని బోనులో బంధించారు.

చిరుత పులి

చిరుత పులి

ఆపై ఆదిలాబాద్‌ జిల్లా కవ్వాల్‌ వన్యప్రాణి అభయారణ్యానికి తరలించారు. చిరుత చిక్కడంతో గ్రామస్థులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Zoo Officers And Locals Catches Tiger In Medak District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X