54 ఏళ్ల వయస్సులో మహిళ పాడు బుద్ధి.. 30 ఏళ్ల అమ్మాయిలా నటిస్తూ రెండో పెళ్లి.. తర్వాత
ఆమె వయస్సు 54 ఏళ్లు.. పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలున్నారు. భర్తతో విడిపోయి ఆమె తల్లితో ఒంటరిగా ఉంటుంది. పని చేయడం చేతగాదు.. ఇంకేముంది ఎవరినైన మోసం చేద్దాం అనుకుంది. 30 ఏళ్ల అమ్మాయిలా మేకప్ వేసుకుని రెండో పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయం తెలియని ఓ వ్యక్తి ఈ కిలాడికి తెలివికి బలయ్యాడు. చివరికి నిజం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు.
తమిళనాడులోని తిరువళ్లురు జిల్లా పుదుప్పేటలో ఓ వ్యక్తి తల్లితోపాటు నివాసం ఉంటున్నాడు. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి అప్పటికే పెళ్లై భార్యతో విడిపోయాడు. డైవర్స్ కూడా తీసుకున్నాడు. అయితే అతని తల్లి తన కొడుకు ఒంటరివాడు కాకూడదని నిర్ణయిం తీసుకుంది. తన కొడుక్కు రెండో పెళ్లీ చేయాలని నిర్ణయించుకుంది. చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో సెకండ్ పెళ్లికి ఒప్పుకుంటారో లేదో అని కాస్త దూర ప్రాంతాల్లో సంబంధాలు చూడడం మొదలు పెట్టింది.

ఈ క్రమంలోనే అతడి తల్లికి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతానికి చెందిన శరణ్య అనే మహిళను పెళ్లి బ్రోకర్ పరిచయం చేశాడు. శరణ్య కూడా పెళ్లై భర్తతో విడిపోయింది. రెండో పెళ్లి చేసుకోవాడానికి రెడీగా ఉందని చెప్పాడు. అయితే శరణ్య తన మేకప్ తో చిన్న వయస్సు దానిలో నటించింది. వెంటనే అతని తల్లి కొడుకుకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. పెళ్లీ చూపుల్లో శరణ్య 30 ఏళ్ల అమ్మాయిల మేకప్ తో అతనికి కనిపించింది. దీంతో అతను పెళ్లికి ఒకే చెప్పాడు. శరణ్యాకు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాత మొదలైంది అసలు కథ. శరణ్య అత్తను ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఆస్తి అంత తన పేరున రాయాలని భర్తపై ఒత్తి తెచ్చింది. విసిగిపోయిన భర్త ఆస్తి రాయడానికి సిద్ధపడి శరణ్య ఆధార్ ఇవ్వాలని అడిగాడు. ఆమె వెంటనే ఆధార్ కార్డ్ ఇచ్చింది. భర్తకు ఆధార్ కార్డ్ చూడగానే కళ్లు భైర్లు కమ్మాయి. ఆమె వయస్సు 54 ఏళ్ల అని తెలిసింది. భర్త పేరు కూడా వేరేగా ఉంది. దీంతో అతను పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి.

శరణ్య అసలు పేరు సుకన్య అని తెలిసింది. ఆమెకు పెళ్లై ఇద్దురు కుమార్తెలు ఉన్నారని, వారికి పెళ్లి కూడా అయిందని విచారణలో తేలింది. భర్తతో విడిగా ఉంటున్న ఆమె డబ్బు కోసం ఇలా నటకమడినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె భర్తతో విడిపోయిన తర్వాత ఓ వ్యక్తితో సహజీనం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications