ఆనందయ్య మందు: ఆయుష్ ఓకే అంటే ఓకే: చెవిరెడ్డి, జంతువులపై కూడా ప్రయోగం..?
ఆనందయ్య ఆయుర్వేద మందుపై సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వస్తున్నాయి. ఆ మందును వాడాల్సిందేనని నెటిజన్లు మొత్తుకుంటున్నారు. ఆయుష్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. పర్మిషన్ ఇచ్చిన వెంటనే ప్రభుత్వమే పంపిణీ చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఇటు ఆనందయ్య మందును జంతువులపై ప్రయోగిస్తామని ఓ శాస్త్రవేత్త ముందుకొచ్చారు.

చెవిరెడ్డి హాట్ కామెంట్స్
ఆనందయ్య మందుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందుకు కేంద్రం ఇలా అనుమతి ఇచ్చిన వెంటనే అలా యుద్ధ ప్రాతిపదికన మందును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమని అన్నారు. ఆనందయ్య శిష్య బృందంతో చెవిరెడ్డి భేటీ అయ్యారు. ఆయుష్ నుంచి అనుమతి వస్తే మందు తయారీని ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పారు.

తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ
తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల ఫార్మసీలో ఔషధ తయారీకి చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్రం నుంచి అనుమతి లభిస్తేనే ఈ మందును పంపిణీ చేస్తామన్నారు. ఆనందయ్య తయారు చేసిన మందు ఖచ్చితంగా పనిచేస్తుందని నివేదిక అందిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఎన్ని లక్షల మందికైనా మందును పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెవిరెడ్డి స్పష్టం చేశారు.

జంతువులపై ప్రయోగం..
జంతువులపై ఆనందయ్య మందు ప్రయోగించాలని శాస్త్రవేత్త భావిస్తున్నారు. సృజన లైఫ్ ల్యాబ్‌కు ప్రయోగాలకు అర్హతపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఆనందయ్య మందుపై అనుమతి వస్తే ప్రయోగాలు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలుకలు, కుందేళ్లపై ప్రయోగం చేసి రిపోర్ట్ ఇస్తామని, జంతువులకు విడతలవారీగా ఆనందయ్య మందు ఇచ్చి చూస్తామని తెలిపారు.

నెలరోజుల సమయం
ప్రయోగాలకు 14 నుంచి 28 రోజులు సమయం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా పలు మందుల విషయంలో.. తమ ల్యాబ్‌లో జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని, కొవిడ్ అధికంగా ఉన్న జంతువుపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జంతువుకు కరోనా సోకించి పరీక్ష చేసే వ్యవస్థ తమ దగ్గర లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications