స్వేచ్చ పేరుతో అణచివేత.. ఆనందయ్య నిర్భందంపై సీపీఐ నారాయణ
సురక్షిత ప్రాంతం పేరుతో కృష్ణపట్నంలో బొనిగి ఆనందయ్యను నిర్బంధించడం తగదని సీపీఐ నేత నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల కోసమే ఆనందయ్యను దాచి పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కార్పొరేట్ వ్యవస్థకు వైసీపీ మంత్రులు బానిసలుగా ఉన్నారని నారాయణ అన్నారు. ఆనందయ్య మందుకు అనుమతి రాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆనందయ్యను స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలని హితవు పలికారు. ఆయనకు విముక్తి కల్పించాలని పిటిషన్ వేస్తామని నారాయణ స్పష్టం చేశారు. కరోనాకు సరి అయిన మందు తీసుకొచ్చిన ఆనందయ్యను అభినందించాలని అభిప్రాయపడ్డారు. కానీ ఆయనకు రక్షణ పేరుతో వేధించడం మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు.

Recommended Video
మరోవైపు ఆనందయ్య వద్ద ఉన్న ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశమే.. వైరస్‌కు ఆయుర్వేదంతో చెక్ పెడతామని చెప్పి.. ఇప్పుడు ఆయన శిష్యులే వైరస్ బారినపడటం మింగుడుపడని విషయం. ఇదీ కార్పొరేట్, మెడికల్ మాఫియా అనుకూలంగా మలచుకునే అవకాశం ఉంది. తమ మీడియా సంస్థల ద్వారా అదే వార్తను పదే పదే ప్రచారం చేసి.. జనాలకు ఆనందయ్య మందు అంటే విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది.
ఇప్పటివరకు అయితే ప్రజలు ఆనందయ్య ఆయుర్వేద మందును విశ్వసిస్తున్నారు. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలే పరీక్షల పేరుతో కాలం గడుపుతున్నాయని ధ్వజమెత్తుతున్నారు. మందు తీసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
