Tirumala: టీటీడీకి కేంద్రం గుడ్ న్యూస్ - భక్తుల విరాళాలపై క్లారిటీ..!!
ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ రిలీఫ్ దక్కింది. కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఎటూ తేలకుండా ఉన్న విదేశీ భక్తుల విరాళాల పైన స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే ఈ విరాళాలకు సంబంధించి అనుమతి లేకపోవటంతో టీటీడీ రూ 3 కోట్లు జరిమానా చెల్లించింది. ఇదే అంశం పైన టీటీడీ కేంద్రంతో వరుసగా జరిపిన సంప్రదింపుల ఫలితంగా ఇప్పుడు కేంద్రం భక్తులు సమర్పించే విదేశీ కరెన్సీ డిపాజిట్లకు అనుమతి ఇస్తూ నిర్ణయం ప్రకటించింది.
తిరుమల వేంకటేశ్వరస్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. శ్రీవారి దర్శనం దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలివస్తారు. కోటానుకోట్ల రూపాయలను కానుకలు సమర్పిస్తూ ఉంటారు. విదేశీ భక్తుల నుంచి వచ్చే విరాళాల పైన సమాచారం ఇవ్వాలని కేంద్రం కోరింది.

భక్తులు శ్రీవారికి కానుకల రూపంలో సమర్పిస్తారని, వాటికి పేర్లు లెక్కలు చెప్పటం కష్టమని టీటీడీ వాదన. దీనికి సంబంధించి కేంద్రం ఫారిన్ కరెన్సీ డిపాజిట్ల వ్యవహరంలో టీటీడీకి 3 కోట్ల జరిమాన విధించింది. ఆరు కోట్ల వరకు జరిమానాగా విధించగా, టీటీడీ చేసిన సంప్రదింపుల ఫలితంగా రూ 3 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.
ఈ వ్యవహారం పైన దుమారం చెలరేగటంతో కేంద్ర హోం శాఖ అధికారులతో టీటీడీ సంప్రదింపులు కొనసాగించింది. టీటీడీకి వచ్చే విదేశీ కానుకల లెక్కలు చెప్పటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. టీటీడీ వ్యాపార సంస్థ కాదని, ధార్మిక సంస్థగా కొనసాగుతోందని వివరించింది. తిరుమల విశిష్ఠత, సెంటిమెంట్ పరిగణలోకి తీసుకొని అనుమతి ఇవ్వాలని టీటీడీ కోరింది.
దీనిని పరిశీలించిన కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫారిన్ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా.. భక్తులు సమర్పించిన ఫారెన్ కరెన్సీని బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు అంగీకరించింది. సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఇలాంటి మినహయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
భక్తులు శ్రీవారికి సమర్పించిన వాటిని కానుకలు గానే చూడాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఫారిన్ కరెన్సీ డిపాజిట్ చేసుకునేందుకు లైసెన్స్ రెన్యూవల్ చేసింది. కానీ, వివరాలు ఉన్నంత వరకు దాతల వివరాలను అందించాలని సూచించింది. టీటీడీ పూర్తిగా భక్తుల విరాళాలు తిరిగి అక్కడే వినియోగిస్తున్నామని స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ నుంచి తాజా నిర్ణయానికి సంబంధించి టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సమాచారం అందింది. అయితే, జరిమానాగా చెల్లించిన రూ 3 కోట్లు రీయంబర్స్ మెంట్ ఉంటుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications