తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి ఉపఎన్నికకు కరోనా ముప్పు-జగన్‌, పవన్ దూరం-మొండిగా చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఈ నెల 17న జరగాల్సిన తిరుపతి ఉపఎన్నికను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. కరోనా లక్షణాలతో ఇప్పటికే పలువురు కీలక నేతలు ప్రచారానికి దూరమయ్యారు. కీలకమైన తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి కేవలం ఒక్కరోజు రావాలని బావించిన సీఎం జగన్‌ కూడా తన సభ రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్‌ కూడా తన ప్రచారం రద్దు చేసుకుని క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. పలువురు టీడీపీ నేతలకు కూడా కరోనా సోకడంతో వారంతా ప్రచార బరి నుంచి వెనుదిరిగారు. దీంతో ఇప్పుడు ఎన్నికల పోలింగ్‌ సక్రమంగా జరుగుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.

Recommended Video

#TirupathiBypoll : Chandrababu Visits Tirumala Temple తిరుమలలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!!
తిరుపతిలో కరోనా కల్లోలం

తిరుపతిలో కరోనా కల్లోలం

ఈ వారాంతంలో ఉపఎన్నికకు సిద్దమవుతున్న తిరుపతి లోక్‌సభ స్ధానం పరిధిలోకి వచ్చే పలు నియోజకవర్గాల్లో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. పోలింగ్‌ తేదీకి సమయం దగ్గరపడుతుండటంతో నేతలు భారీగా రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నారు. పలువురు కీలక నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో తిరుపతి లోక్‌సభ స్ధానంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ క్షేత్రస్ధాయి పరిస్దితులను గమనిస్తే ప్రచారం చేయడం కంటే దూరంగా ఉండటమే మంచిదని ప్రధాన పార్టీల నేతలు భావిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

తిరుపతి ప్రచారానికి జగన్, పవన్ దూరం

తిరుపతి ప్రచారానికి జగన్, పవన్ దూరం


తిరుపతిలో నెలకొన్న కరోనా వ్యాప్తి పరిస్ధితుల్ని గమనిస్తున్న ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్దితి ఉంది. సీఎం జగన్‌ వైసీపీ కీలకంగా భావిస్తున్న తమ సిట్టింగ్ స్ధానం తిరుపతిలో ప్రచారానికి ఒక్కరోజు రావాలని భావించినా చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఆరంభంలో ప్రచారం చేసిన పవన్‌ కళ్యాణ్‌.. కొన్ని రోజులుగా అక్కడి పరిస్దితుల్ని గమనిస్తున్నారు. అదే సమయంలో తన చుట్టూ ఉన్న వారిలో ప్రతీ రోజూ కొందరు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ అవుతుండటంతో చివరికి చేసేది లేక పవన్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. దీంతో రెండు ప్రధాన పార్టీల కీలక నేతలు లేకుండానే ప్రచారం సాగిపోతోంది.

టీడీపీ ప్రజాప్రతినిధులకూ కరోనా

టీడీపీ ప్రజాప్రతినిధులకూ కరోనా


తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీ నేతలు విస్తృతంగా తిరుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువ నేతలతో పాటు ప్రజాప్రతినిధులందరినీ టీడీపీ తిరుపతి ప్రచారంలోకి దింపింది. కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్న వీరిలో పలువురికి కరోనా సోకింది. ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. తిరుపతి ప్రచారానికి వెళ్లి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్దారణ అయిన పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అయితే చంద్రబాబు, లోకేష్‌తో పాటు పలువురు సీనియర్లు కరోనాకు దూరంగా ప్రచారం సాగిస్తుండటం టీడీపీకి ఊరటనిచ్చే అంశం

ఉపఎన్నికకు కరోనా ముప్పు

ఉపఎన్నికకు కరోనా ముప్పు

తిరుపతిలో ఈ నెల 17న శనివారం ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ స్ధానం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నేతలు వద్దంటే ఇళ్లకు వెళ్లి ప్రచారాలు చేస్తున్నారు. దీంతో ఓటర్లకు కూడా కరోనా సోకుతోంది. ఐదురోజుల్లో పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి దారుణంగా ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. పోలింగ్‌ దగ్గరపడుతుండటంతో నేతలు ప్రచారాన్ని మరింత ఉదృతం చేస్తున్నారు. దీంతో వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది. అన్నింటి కంటే మించి పోలింగ్‌పై కరోనా ప్రభావం పడేలా కనిపిస్తోంది. దీంతో ఎంత ప్రచారం చేసినా చివరకు ఓటర్లు కరోనా భయాలతో పోలింగ్‌కు రాకపోతే పరిస్ధితి ఏంటన్న ఆందోళన నేతల్లో పెరుగుతోంది.

English summary
covid 19 spread fears looms in tirupati byelection campaign as several key leaders including cm jagan, pawan kalyan already missed the campaign and cancel their rallies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X