తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీడీ చైర్మన్ వైవీకి షాక్ ..ఆ ఆదేశాలు చెల్లవు అఫిడవిట్ దాఖలు చెయ్యండన్న హై కోర్టు

|
Google Oneindia TeluguNews

టీటీడీ బోర్డు చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి కి హైకోర్టు షాక్ ఇచ్చింది . పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల స్పెషల్ దర్శనాలపై హైకోర్టు ఆసక్తికర చర్చ చేసింది . టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన ఆదేశాలు చెల్లవని హై కోర్టు పేర్కొంది. ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలపై టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ వివరణ కోరింది హైకోర్టు. కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని స్టాండింగ్ కౌన్సిల్ ను ప్రశ్నించింది.

జగన్ అమ్మ ఒడి పథకం ఎఫెక్ట్ .. పిల్లల్ని ఎత్తుకెళ్ళి స్కూళ్ళలో పడేస్తున్న తల్లిదండ్రులుజగన్ అమ్మ ఒడి పథకం ఎఫెక్ట్ .. పిల్లల్ని ఎత్తుకెళ్ళి స్కూళ్ళలో పడేస్తున్న తల్లిదండ్రులు

శ్రీవారి సన్నిధిలో ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 పేరిట ఉన్న ప్రస్తుత వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దుచేస్తామని, వీఐపీలు ఏడాదికొకసారే రావాలని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఛైర్మన్‌ ప్రకటన నేపథ్యంలో సర్వత్రా అనేక సందేహాలు వినిపించాయి. మరి వీఐపీల పరిస్థితి ఏంటి అన్న వాదన వినిపించింది. ఈ నిర్ణయంతో స్వామీ వారికి వచ్చే ఆదాయం తగ్గుతుందని చర్చ జరిగింది. సామాన్య ప్రజలు మాత్రం ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు . అయితే బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ బోర్డు తో సంబంధం లేకుండా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారంటూ స్టాండింగ్ కౌన్సిల్ స్షష్టం చేసింది. అయితే టీటీడీ చైర్మన్‌ ప్రకటనను పరిగణనలోకి తీసుకోలేమని, బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు జీవో ఉంటే కోర్టుకివ్వాలని కోర్టు ఆదేశించింది.

High court shocked TTD chairman Y.V .. High Court ask for to submit affidavit

బోర్డు లేకుండా చైర్మన్‌ తీసుకునే నిర్ణయం చెల్లదని పిటిషనర్‌ తన వాదనలు వినిపించారు. బోర్డు ఏర్పాటు కాకుండా చైర్మన్ నిర్ణయం తీసుకోవడం చెల్లదని స్పష్టం చేసింది. జీవో లేదా ఆర్డర్ లేకుంటే లిఖితపూర్వకంగా బ్రేక్ దర్శనాలు రద్దు చెయ్యటం సాధ్యం కాదని పేర్కొంది. మరోవైపు ప్రోటోకాల్ దర్శనాలను పేర్లు మార్చి వీఐపీ దర్శనాలు అంటూ తీసుకువస్తున్నారంటూ పిటీషనర్ వాదించారు. తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని పిటీషనర్ వాదించారు. పిటీషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలపై పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలంటూ హైకోర్టు టీటీడీ స్టాండింగ్ కమిటీని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

English summary
TTD Chairman YV Subba Reddy has announced that the existing VIP break darshan in the name of L1, L2 and L3 will be canceled. In the wake of the Chairman's statement, many doubts have been raised. And what about the situation of VIPs? There was discussion that Swami's income was going down. The general public was happy with the decision.However, the Standing Council made it clear that TTD Chairman YV Subbareddy had decided to cancel the break darshans and not the board. However, the court did not consider the announcement of the chairman of the TTD .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X