టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.11 కోట్లు విరాళం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు 1.11 కోట్ల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్ కు చెందిన యగమేటి రామిరెడ్డి అనే భక్తుడు ఈ విరాళాన్ని అందించారు.
ఈ మేరకు విరాళం మొత్తంతో కూడిన చెక్కును ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సమక్షంలో గురువారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రామిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఉదయం రామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలను సమర్పించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఆవరణలో ఉన్న రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ ను కలిసి చెక్కును అందజేశారు.












Click it and Unblock the Notifications