తిరుపతి కోవిడ్ కేర్ సెంటర్‌లో ప్రమాదం: గర్భిణీ దుర్మరణం: నాణ్యత లేని భవన నిర్మాణమే కారణమంటూ

తిరుపతి: తిరుపతిలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణం పూర్తయిన కొత్త వార్డు శ్లాబ్ విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు. ముగ్గురు కరోనా వైరస్ పేషెంట్లు గాయపడ్డారు. శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (స్విమ్స్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి భవనం నాలుగో అంతస్తుపై నుంచి సిమెంట్ దిమ్మెలు విరిగిపడటంతో మహిళా అటెండర్ ఒకరు మృతి చెందారు. మృతురాలు గర్భంతో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు..

కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం స్విమ్స్ ఆవరణలో జిల్లా అధికారులు కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. స్టేట్ డిజిగ్నేటెడ్ కోవిడ్ కేర్ సెంటర్ ఇది. ఈ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నాలుగో అంతస్తుపై కొత్తగా వార్డులను నిర్మిస్తున్నారు. ఈ వార్డుల నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగిలిన పనులను పూర్తి చేసుకుని.. వచ్చే నెలలో ఈ కొత్త వార్డును పేషెంట్ల కోసం అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో- శ్లాబ్ దిమ్మెలు, సిమెంట్ పెచ్చులు విరిగి పడ్డాయి. నాలుగో అంతస్తు నుంచి పెద్ద శబ్దం చేస్తూ అవి కింద పడ్డాయి. ఆ సమయంలో రాధిక అనే ఆసుపత్రి అటెండర్ అక్కడే ఉన్నారు.

lady attender killed at Covid care Centre in Tirupati

కరోనా సోకిన పేషెంట్లను వీల్‌ఛైర్‌లో తీసుకెళ్తోన్న సమయంలో శ్లాబ్ దిమ్మెలు ఆమెపై పడ్డాయి. దీనితో రాధికకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను వెంటనే ఆమెను వెంటనే అంబులెన్స్‌లో ప్రధాన ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు. అప్పటికే ఆమె మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కరోనా పాజిటివ్ పేషెంట్లు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలు ఆరు నెలల గర్భంతో ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. నాణ్యత లేని నిర్మాణం వల్లే ఈ ప్రమాదం సంభవించందని ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+