మోదీకి సిగ్గుందా: జవాన్లు మరణిస్తే ప్రధాని ఎక్కడ ఉన్నారు :రాహుల్ ధ్వజం..!
ప్రధాని మోదీ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పుల్వామా లో ఉగ్రదాడి లో సైనికులు మరణిస్తే.. ప్రధాని మోదీ షూటింగ్ లకు ఫోజులు ఇవ్వటానికే ప్రాధాన్యత ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. సైనికుల కుటుంబాల ను పరామర్శించాలనే ఆలోచన కూడా ప్రధానికి రాలేదన్నారు.
జవాన్లు మరణిస్తే సినిమాలు ముఖ్యమా...
పుల్వామా లో మన సైనికుల పై ఉగ్రవాదులు దాడి చేసి..సైనికులను హతమారిస్తే మూడున్నార గంటల పాటు ప్రధాని మోదీ సినిమాల్లో ఫోజులు ఇస్తూ సమయం గడిపారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సైనికుల పై దాడి జరిగిందని..పెద్ద సంఖ్యలో సైనికులు మరణించారని సమాచారం అందినా..నవ్వుతూ కెమేరాల ముందు నిల బడ్డారని అసలు మోదీకి మానవత్వం ఉందా అని రాహుల్ ప్రశ్నించారు. అంత పెద్ద మొత్తంలో సైనికులు మరణిస్తే కనీసం వారి కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలవాలనే ఆలోచన కూడా ప్రధాని గా వ్యక్తిగా రాలేదన్నారు.
అసలు ఈ ప్రధానికి సిగ్గుండా అని రాహుల్ నిలదీసారు. సైనికుల పై దాడి జరిగితే ప్రధాని గా ఉన్న వ్యక్తి మూడున్నార గంటల వరకు స్పందించకపోవటం దారుణం అని రాహుల్ విమర్శించారు.

చౌకీదార్ కాదు..మోదీ చోర్..
మోదీ ఇప్పటి వరకు ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని రాహుల్ ధ్వజమెత్తారు. రాఫెల్ విషయంలో అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని, కాపలాదారుడే దొంగ అని ప్రజలు అంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సత్యాలే చెబుతుందని స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని, తమ హయాంలో రూ.70 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. మోదీ పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ చేశారని, రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో రెండ్రోజుల్లో రుణమాఫీ చేశామని, కాంగ్రెస్ మాట మీద నిలబడే పార్టీ అని మరోసారి రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. రైతులకు ఏం చేయలేని ప్రధాని..పారిశ్రామిక వేత్తలకు మూడున్నార లక్షల రుణ మాఫీ చేసారని ధ్వజమెత్తారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications