తిరుమలలో క్యూకాంప్లెక్స్ లు ఫుల్, శిలాతోరణం వరకు క్యూ, దర్శనానికి !
తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు తీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం, గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో కొండ మీదకు చేరుకున్నారు.
గురువారం అర్దరాత్రి వరకు తిరుమలలో శ్రీ వెకంటేశ్వరస్వామిని 74, 583 మంది దర్శించుకున్నారు. గురువరం అర్దరాత్రి వరకు 40, 343 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకునిన మొక్కులు తీర్చుకున్నారు. గరువారం రాత్రి వరకు భక్తులు హుండీలో రూ. 3. 37 కోట్లు ముడుపులు సమర్పించుకున్నారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టిక్కెట్లు ఉన్న భక్తులకు సకాలంలోనే స్వామివారి దర్శనం కలుగుతోంది. దర్శనం టిక్కెట్లు లేని భక్తులకు స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి 36 గంటల సమయం పడుతోందని శుక్రవారం ఉదయం టీటీడీ అధికారులు తెలిపారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటీ పడటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయి క్యూలైన్లు శిలాతోరణం వరకు ఉన్నాయి.
భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండంటంతో టీటీడీ అధికారులు క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తులకు మంచినీరు, ప్రసాదాలు పంపిణి చేస్తున్నారు. దర్శనం టిక్కెట్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందని, భక్తులు క్యూకాంప్లెక్స్ ల్లో ఓపిగా ఉండాలని టీటీడీ అధికారులు మనవి చేస్తున్నారు.
తిరుమలలో పలు ప్రాంతాల్లో భక్తులకు ప్రసాదాలు, మంచినీరు పంపిణి చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో పలు ప్రాంతాల్లో చలివేండ్రాలు ఏర్పాటు చేశారు.

తిరుమలలో ఉన్న మరుగుదోడ్లు, క్యూకాంప్లెక్స్ ల్లో ఉన్న మరుగుదోడ్లు, బాత్ రూమ్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్న సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూస్తున్నారు. రానున్న రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
-
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications