తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో సప్త వాహనాలపై శ్రీవారి దర్శనం - రధ సప్తమి వేళ భారీగా భక్త జనం..!!

రధసప్తమి నాడు తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఏడు వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులకు దర్శనం

|
Google Oneindia TeluguNews

Tirumala: తిరుమలలో రధసప్తమి వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. సూర్యభగవానుడి జన్మదినం రధసప్తమి నాడు తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఏడు వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో విహరించే వేళ.. భక్తులకు దర్శనానికి ఏర్పాట్లు చేసారు. సూర్య ప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనమిస్తున్నారు. నేటి ప్రత్యేకమైన రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. ఈ రోజు వరకు టీటీడీ వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు సర్వ దర్శన టోకెన్ల జారీ రద్దు చేసింది. భక్తులకు అదనంగా ప్రసాదాలను సిద్దం చేసింది.

సప్తవాహనాలపై శ్రీవారి దర్శనం

సప్తవాహనాలపై శ్రీవారి దర్శనం

రధ సప్తమి వేళ టీటీడీ వైభవంగా వేడుకలను నిర్వహిస్తోంది. ఇప్పటికే మాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవ ప్రారంభమైంది. రాత్రి వరకు వరుసగా సప్త వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీంతో.. భారీగా భక్తులు తరలి వచ్చారు. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. భక్తుల కోసం మాడవీధుల్లోని గ్యాలరీల్లో నిరంతరాయంగా అన్నప్రసాదాలు.. అన్న పానీయాలను టీటీడీ అందిస్తోంది.

తాత్కాలకి షెడ్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. చలి ఎక్కువగా ఉన్నా స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి.. సేవలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఈ రోజు శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించనున్నారు. శ్రీవారు భక్తులు రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు గా భావించటం మరో ప్రత్యేకత.

మినీ బ్రహ్మోత్సవాలుగా నిర్వహణ

మినీ బ్రహ్మోత్సవాలుగా నిర్వహణ

ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం లో ఊరేగింపు ఉంటుంది. మధ్నాహ్నం 2 గంటల నుంచి 3 వరకు స్వామి వారి చక్రస్నానం ఉంటుందని అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం పై మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అయిదో వాహనంగా సర్వ భూపాల వాహనం పైన స్వామి వారి ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు. ఆరో వాహనంగా సర్వభూపాల వాహనం పైన సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు ఊరేగింపు ఉంటుంది. ఈ వాహనాల ద్వారానే భక్తులకు స్వామి వారి దర్శనం కలగనుంది. చివరగా రాత్రికి 8 గంటల నుంచి 9 గంటలకు స్వామి వారు చంద్రప్రభ వాహనంలో మాడ వీధుల్లో విహరిస్తారు.

ఆర్దిత సేవలు రద్దు..భారీగా భక్తులు

ఆర్దిత సేవలు రద్దు..భారీగా భక్తులు

రథ సప్తమి నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రధ సప్తమి పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి..ఈవో ధర్మారెడ్డి ప్రత్యక్షంగా సేవలను ..భక్తులకు సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు.

భక్తులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ప్రతీ ఏటా తిరుమలలో రధ సప్తమి నాడు జరిగే విశేష కార్యక్రమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంత..ఈ రోజు సప్త వాహనాల్లో శ్రీవారి దర్శనం కోసం ముందుగానే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ప్రస్తుతం తిరుమలలో రధ సప్తమి వేడుకలు ఘనంగా కొనసాగతున్నాయి.

English summary
Radhasaptami Celebrations starts at Tirumala, Lord malayappa bestows on the seven Vehicels on the special day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X