నేడు ఏపి కి రాహుల్..! హోదా పట్ల భరోసా ఇవ్వనున్న కాంగ్రెస్ చీఫ్..!!
తిరుపతి/హైదరాబాద్ : ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మరో సారి ఏపి లో పర్యటించబోతున్నారు. రాహుల్‌గాంధీ శుక్రవారం తిరుపతిలో నిర్వహించనున్న 'ఏపీ ప్రత్యేక హోదా భరోసా బస్సుయాత్ర' బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని గత ఎన్నికల్లో తిరుపతిలోని తారకరామ మైదానం వేదికగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ హామీలిచ్చిన విషయం తెలిసిందే. అదే మైదానంలో శుక్రవారం బహిరంగ సభ జరగనుంది. హోదాపై ఎన్డీయే మాటమార్చిన వైనాన్ని రాహుల్ ఎండగట్టడంతో పాటు, తమ పార్టీ వైఖరిని వెల్లడించనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

శుక్రవారం ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి రేణిగుంటకు రాహుల్‌గాంధీ చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటల తర్వాత శ్రీవారిని దర్శించుకొని తిరిగి తిరుపతికి చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి బాలాజీకాలనీ కూడలికి చేరుకొని.. మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులర్పిస్తారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కలిసి భరోసా యాత్ర బస్సులో తారకరామ మైదానానికి చేరుకుంటారు. సాయంత్రం 5గంటలకు సభలో ప్రసంగించనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్తారు. కాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు ఈ బహిరంగ సభకు హాజరుకానున్నారు. కేంద్ర బలగాలు ఇప్పటికే తారకరామ స్టేడియాన్ని ఆధీనంలోని తీసుకున్నాయి.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications