తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతిలో అమరావతి పాదయాత్ర ఎంట్రీ: ఫ్లెక్సీల ధ్వంసం: తీవ్ర ఉద్రిక్తత.. భారీగా అరెస్టులు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ఈ మధ్యాహ్నం తిరుపతికి చేరుకుంది. ఇందులో పాల్గొన్న రైతులు, అమరావతి పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. దీని తరువాత 17వ తేదీన పాదయాత్ర ముగింపు సభను నిర్వహించాల్సి ఉంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలీసుల నుంచి అనుమతి ఇంకా అందాల్సి ఉంది.

తిరుపతిలో ఉద్రిక్తత..

తిరుపతిలో ఉద్రిక్తత..

అమరావతి పాదయాత్ర తిరుపతిలో ప్రవేశించిన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పాదయాత్రను స్వాగతిస్తూ తిరుపతి ప్రజలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను అమరావతి ప్రాంత రైతులు చించేశారు. మీతో మాకు గొడవలు వద్ద..మీకు మా స్వాగతం.. మాకు మూడు రాజధానులే కావాలి.. అంటూ తిరుపతి ప్రజల పేరు మీద అనేక ప్రాంతాల్లో వెలిసిన బ్యానర్లను వారు ధ్వంసం చేశారు. భారీ ఫ్లెక్సీలను కిందికి పడదోశారు. కనిపించిన వాటిని కనిపించినట్టే ధ్వసం చేశారు. జై అమరావతి అంటూ నినదించారు.

 వ్యతిరేకించిన స్థానికులు..

వ్యతిరేకించిన స్థానికులు..

తిరుపతిక వచ్చిన వెంటనే అమరావతి ప్రాంత రైతులు, పరిరక్షణ సమితి ప్రతినిధులు ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లను ధ్వంసం చేయడం, జై అమరావతి అంటూ నినదించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. బ్యానర్లను చించి వేయడానికి ప్రయత్నించిన రైతు ప్రతినిధులను స్థానికులు ఒకట్రెండు చోట్ల అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ అభిప్రాయాలను తాము చెప్పుకొన్నామని, దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదంటూ ప్రతిఘటించారు.

 స్థానికులు ర్యాలీ..

స్థానికులు ర్యాలీ..


అమరావతి ప్రాంత రైతుల వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి సారథ్యంలో స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా ప్రదర్శన చేపట్టారు. బ్యానర్లను ప్రదర్శించారు. పలువురు విద్యార్థి సంఘాలు నాయకులు ఇందులో పాల్గొన్నారు. పరిపాలనను వికేంద్రీకరించాల్సిందేనంటూ నినదించారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు.

ర్యాలీ.. లాఠీఛార్జీ..

ర్యాలీ.. లాఠీఛార్జీ..

అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర తిరుపతిలో ప్రవేశించిన కొద్దిసేపటికే ఆంధ్రప్రదేశ్ పోరాట సమితి ప్రతినిధులు ఈ ర్యాలీని నిర్వహించడాన్ని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇందులో పాల్గొన్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వారిని నియంత్రించడానికి కొన్ని చోట్ల లాఠీఛార్జీ చేశారు.

రాయలసీమను రాళ్లసీమగా చేయొద్దు..

రాయలసీమను రాళ్లసీమగా చేయొద్దు..

రాష్ట్రాభివృద్ధిని వికేంద్రీకరించాలంటూ సమితి నాయకులు డిమాండ్ చేశారు. రాయలసీమను మళ్లీ రాళ్లసీమగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణం ఉన్నంత వరకూ మూడు రాజధానుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. వికేంద్రీకరణకు మద్దతుగా, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని, అమరావతి ప్రాంత రైతుల పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.

రాయలసీమకు మాత్రమే న్యాయం చేయమనట్లేదు..

రాయలసీమకు మాత్రమే న్యాయం చేయమనట్లేదు..

తాము స్వార్థంగా ఆలోచించట్లేదని ఆంధ్రప్రదేశ్ పోరాట సమితి నాయకులు స్పష్టం చేశారు. రాయలసీమ మాత్రమే అభివృద్ధి చెందాలని డిమాండ్ చేయట్లేదని అన్నారు. మూడు ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలనేదే తమ కోరిక అని అన్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రయత్నాలు సజావుగా సాగాలని చెప్పారు. అమరావతి ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలని పట్టుబట్టడం ఎలాంటి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధి కోసం ఇంతకంటే పెద్ద ఉద్యమాన్నినిర్వహిస్తామని తేల్చి చెప్పారు.

English summary
Tension prevails in Tirupati after Amaravati farmers padayatra getting entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X