తిరుమలలో భారీ వర్షాలు - రాకపోకలపై టీటీడీ కీలక నిర్ణయం..!!

Tirumala: భారీ వర్షాలకు తిరుమల కొండ తడిసి ముద్దయింది. మాండౌస్ తుఫాను ప్రభావంతో తిరుమల కొండ పైన భారీ వర్షం కురుస్తోంది. వర్షాల ప్రభావంతో కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉండటంతో.. టీటీడీ కలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండ పైన కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. భక్తుల రాకపోకల పైన తాత్కాలికంగా నిర్ణయం తీసుకుంది. దీంతో, పావనాశనం, శిలాతోరణం మార్గాలను టీటీడీ తాత్కాలికంగా మూసివేసింది. మెట్ల మార్గం పైన ప్రత్యేకంగా నిఘా పెట్టింది. మెట్ల మార్గంలో పరిస్థితికి అనుకూలంగా భక్తుల రాకపోకల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

మాండౌస్ తుఫాను తీరం దాటటంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల కొండ పైన రాత్రి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా పడుతోంది. దీంతో శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సుకు చేరుకునేందుకు, దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tirumala witnessed heavy rainfall due to the influence of Cyclone Mandous , TTD Taken key decisions

వర్షం కొనసాగితే కొండ చరియలు విరిగే పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా టీటీడీ చర్యలు ప్రారంభించింది. అక్కడ భక్తుల రాకపోకలపైన ఆంక్షలు విధించింది. ఇక తిరుమలలో సందర్శనీయ ప్రాంతాలైన ఆకాశగంగ, శ్రీవారి పాదాలు తదిర ప్రాంతాలు వర్షం కారణంగా భక్తులు లేక వెలవెలపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఆరుబయట నిర్వహిస్తున్న దుకాణదారులు మూసివేశారు.

వర్షం కారణంగా తిరుమల గిరులను, ఘాట్‌రోడ్డులను పొగమంచు కమ్మేయండో ఘాట్‌రోడ్డులో ప్రయాణించే వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ఇదిలా ఉంటే గత మూడురోజులుగా తుపాన్‌ ప్రభావం కారణంగా తిరుమలలో చలితీవ్రత పెరిగింది.

దీనికి తోడు ఈదురుగాలు ఎక్కువగా వీస్తుండడంతో చలితీవ్రత పెరిగి చంటిపిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతూ గదులకే పరిమితం అయ్యారు. ఇదే సమయంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా మాండూస్ తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+