Tirumala:శ్రీవారికి తిరుమంజనం..ఏడాదికి ఎన్నిసార్లు.. ఎలా నిర్వహిస్తారు

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

తిరుపతి: ఆళ్వారాలు అనగానే వెంటనే మనకు 12గురు ఆళ్వారుల పేర్లు గుర్తుకు వస్తాయి. ఆ 12 గురిలో కొయిల్ ఆళ్వార్ లేడు. దేవాలయాన్నే ఆళ్వార్గా చెప్పడం వైష్ణవ పరిభాష. అంచేత కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ప్రధాన దేవత ఉన్న ప్రదేశాన్ని అభిషేకించిడమని విశిష్టర్ధం. ఆలయ పరిసరాన్ని ప్రత్యేకించి గర్బాలయాన్ని పవిత్రంగా ఉంచడాని కోసం జరిపే సేవ కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం'.

సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్విహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.

Tirumanjanam to be performed to Lord Venkateshwara.

తిరుమల గర్భాలయంలో స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా కొలువైన పవిత్ర గర్భాలయ స్థానమే ఆనందనిలయం. ఆనందనిలయం నుంచి ఆలయమహాద్వారం వరకు శుద్ధిచేయటమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. దుమ్మూధూళి పడకుండా స్వామి శిరస్సు నుంచి పాదాల వరకు ధవళవర్ణ వస్త్రాన్ని కప్పుతారు. దీన్నే 'మలైగుడారం' అంటారు. స్వామి అంశగా భావించే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని మలైగుడారం లోపలే ఉంచుతారు.

ఇక్కడే కొలువైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగద పరివార దేవతా మూర్తులను ఘంటా మండపం గరుడాళ్వార్ సన్నిధికి తరలిస్తారు. చుట్టూ తెరలు కట్టి ఈ మూర్తులకు ఏకాంతంగా తిరుమంజనం పూర్తిచేసి కొత్త పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. గర్భాలయంలో అర్చకులు, పరిచారకులు, ఏకాంగులు మాత్రమే ప్రవేశించి నాలుగు గోడలు, పైకప్పుకు అంటుకున్న దుమ్ముధూళి, బూజు, కర్పూరమసిని తొలగించి, శుద్ధజలంతో శుద్ధిచేస్తారు. కులశేఖరపడి మొదలు మహాద్వారం వరకు ఆలయ అధికారులు, ఉద్యోగులు శుద్ధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

Tirumanjanam to be performed to Lord Venkateshwara.

నాముకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పనువు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపి పవిత్ర జలంతో ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఆనందనిలయం, బంగారువాకిలి శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరుస్తున్నారు.

Tirumanjanam to be performed to Lord Venkateshwara.

ఆరోజు ఉదయం 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు, తితిదే సిబ్బంది నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి కప్పబడి ఉన్న వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేధ్యం సమర్పించిన తర్వాత.. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+