శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్: కొత్తగా తిరుపతికి బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ రానుందోచ్: 21 బోగీలతో..!!
తిరుపతి: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఏపీ, తెలంగాణల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై వరాల జల్లును కురిపించింది. వాటిని పూర్తి చేయడానికి, విస్తరణ పనులను చేపట్టడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదే సమయంలో తిరుపతికి మరో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును మంజూరు చేసింది రైల్వే బోర్డ్. తిరుపతి- కేరళలోని కొల్లం మధ్య కొత్తగా ఈ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది. వారానికి రెండు రోజుల పాటు నడిచే ఎక్స్‌ప్రెస్ ఇది. దీనితోపాటు ఎర్నాకుళం- వేళాంకిణి ఎక్స్‌ప్రెస్‌కూ ఆమోదం తెలిపింది. పాలక్కాడ్- తిరునెల్వేలి మధ్య నడిచే పాలరువి ఎక్స్‌ప్రెస్‌ను ట్యుటికోరిన్ వరకూ పొడిగించడానికి అంగీకరించింది.

తిరుపతి-కొల్లం మధ్య ప్రవేశపెట్టిన కొత్త ఎక్స్‌ప్రెస్‌కు నంబర్ ఇంకా కేటాయించాల్సి ఉంది. దీనికి హాల్ట్ సౌకర్యాన్ని కల్పించిన స్టేషన్లు, టైమింగ్స్.. ఇతర వివరాలను రైల్వే బోర్డు వెల్లడించింది. త్వరలోనే ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తామని, దీనికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని వివరించింది.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2:20 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే ఈ ఈ ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు తెల్లవారు జామున 6:20 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది. ప్రతి బుధ, శనివారాల్లో కొల్లం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరే మరో ఎక్స్‌ప్రెస్.. మరుసటి రోజు తెల్లవారు జామున 3:20 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.

చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్, కాయంకుళం, చంగనస్సెరి, మావెళికార మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది. మొత్తం 21 బోగీలు ఉంటాయి. క్యాటరింగ్ సర్వీసు అందుబాటులో ఉంటుంది.












Click it and Unblock the Notifications