ఆ ఐదుగురు విద్యార్థులు సేఫ్, ఆగ్రాలో ప్రత్యక్షం, పోలీసుల అదుపులో స్టూడెంట్స్
పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్ తిరుపతిలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ విద్యార్థుల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. వారిని పోలీసులు ఆగ్రా సమీపంలో గుర్తించారు. ప్రస్తుతం వారు ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్నారని తెలిసింది. వారు క్షేమంగా ఉన్నారని తెలిసి.. పేరంట్స్ రిలాక్స్ అయ్యారు.
తిరుపతి అన్నమయ్య స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఈ నెల 9వ తేదీ నుంచి కనిపించడం లేదు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో తిరుపతి పడమర పోలీసులు గాలింపు చేపట్టారు.పిల్లలను తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఆగ్రా చేరుకున్నాయి.

ఉదయం స్టడీ అవర్ అని చెప్పి స్కూల్‌కి వెళ్లిన పిల్లలు.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. విద్యార్థులు రైలు ఎక్కినట్టు సీసీటీవీ ఫుటేజ్ కనిపించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫుటేజీ బట్టి ఆగ్రాకు వెళ్లినట్టు గుర్తించారు. విద్యార్థుల మిస్సింగ్ తిరుపతి జిల్లాలో కలకలం రేపింది.
నెహ్రూ నగర్‌లో ఉన్న అన్నమయ్య స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. పేరంట్స్ ఆందోళన చెందారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు బృందాలు.. గాలించి ఆచూకీని కనుగోగలిగారు. దీంతో పోలీసులకు పేరంట్స్ థాంక్స్ చెప్పారు.












Click it and Unblock the Notifications