PV Sindhu: టార్గెట్ 2024: శ్రీవారి ఆశీర్వాద బలంతో: తిరుమలలో స్టార్ షట్లర్

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లో వెలిసిన శ్రీవేంకటేశ్వర స్వామివారిని భారత స్టార్ షట్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించడానికి గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథిగృహంలో బస చేశారు. అంతకుముందు ఆమె వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెను సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ఈ తెల్లవారు జామున వీఐపీ దర్శన సమయంలో వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో పీవీ సింధుకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. శ్రీవారి చిత్ర పటాన్ని అందచేశారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు పలికారు. ఆ సమయంలో పీవీ సింధు వెంట చాముండేశ్వరి నాథ్ ఉన్నారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన తరువాత కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Tokyo Olympic bronze medallist PV Sindhu offered prayers at Tirumala Srivari temple

బ్యాడ్మింటన్ అకాడమీని నెలకొల్పడానికి ప్రభుత్వం విశాఖపట్నంలో తనకు రెండెకరాల స్థలాన్ని కేటాయించిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ అకాడమీ ద్వారా మరింత మందిని నాణ్యమైన బ్యాడ్మింటన్ ప్లేయర్లుగా తీర్చిదిద్దాలనేది తన లక్ష్యమని అన్నారు. అకాడమీ ద్వారా మెరికల్లాంటి ప్లేయర్లను దేశానికి అందిస్తానని చెప్పారు. అకాడమీ పనులు నిర్విఘ్నంగా సాగాలని శ్రీవేంకటేశ్వర స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. క్రీడలు, క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పీవీ సింధు వ్యాఖ్యానించారు. గ్రామీణ స్థాయిలో అనేక మంది నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారని పేర్కొన్నారు.

2024లో ప్యారిస్‌లో నిర్వహించే ఒలింపిక్స్‌లో తప్పకుండా పాల్గొంటానని, శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో బంగారు పతకాన్ని సాధిస్తానని చెప్పారు. ఈ సారి టోక్యో ఒలింపిక్స్ అద్భుతంగా జరిగాయని, భారత్‌కు ఏడు పతకాలు లభించాయని అన్నారు. జావెలిన్ థ్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలవడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని పీవీ సింధు వ్యాఖ్యానించారు. సెమీ ఫైనల్‌లో ఓడిపోవడం తనకు నిరుత్సాహాన్ని కలిగించినప్పటికీ.. దాన్ని అధిగమించి కాంస్య పతకాన్ని సాధించానని చెప్పారు. ప్రతి టోర్నమెంట్‌లోనూ విజయాలు దక్కేలా శ్రమిస్తానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+