Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ - వైకుంఠ ఏకాదశి స్పెషల్ : దర్శనం టికెట్లు ఇలా ..!!
Tirmula Srivari Darshanam: తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. జనవరి 1, వైకుంఠ ఏకాదశి పర్వదినం రద్దీ ఎక్కువగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి తగినట్లుగానే ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో కరనా సబ్ వేరియంట్ వ్యాప్తి వేళ టీటీడీ అప్రమత్తమైంది. భక్తులకు కీలక సూచనలు చేసింది. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపైన అధికారులతో సమీక్షించారు. సామాన్య భక్తులకే వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.

తిరుమలకు వచ్చే భక్తులు పాటించండి
కరోనా వ్యాప్తి హెచ్చరికలతో తిరుమలకు వచ్చే భక్తులు నిబంధనలు పాటించాలని సూచించారు. దర్శనం కోసం వచ్చే భక్తులు మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని చెప్పారు. వ్యక్తిగతంగా నియంత్రణ..శానిటైజేషన్ పాటించాలని సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. ఇక, ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1వ తేదిన సర్వదర్శనం టోకేన్లు జారీ రద్ద చేసినట్లు భక్తులు ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రయాణానికి ఏర్పట్లు చేసుకోవాలని సూచించారు. కానీ, వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం తిరుపతిలో 9 కేంద్రాల్లో 92 కౌంటర్ల ద్వారా టికెట్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ కౌంటర్ల ద్వారా వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన తొమ్మది కేంద్రాల్లో జనవరి 1వ తేదీ నుంచి టోకన్ల జారీ ప్రారంభం కానుంది.

వైకుంఠ ఏకాదశి నాడు సేవలు ఇలా
సర్వదర్శనం కోసం భక్తులకు ఈ కౌంటర్ల ద్వారా 4.5 లక్షల టోకెన్ల జారీ చేయనున్నారు. శ్రీవాణి ట్రస్టు భక్తులకు ఆన్‌లైన్‌లో రోజుకు 2వేల చొప్పున టికెట్లు జారీ చేశామని, ఆఫ్ లైన్‌లో ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ నిలిపివేశామని ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. సర్వదర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు.డిసెంబర్ 29 నుండి జనవరి 3వ తేది వరకు అడ్వాన్స్ విధానంలో వసతి గదులు కేటాయింపు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో అంటే జననరి 2, 3వ తేదిలలో సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదని ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ రెండు రోజులు స్వయంగా వీఐపీలు వస్తేనే దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇక, వైకుంఠ ఏకాదశి నాడు నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఏకాదశి పర్వదినం నాడు ఉదయం 9 గంటలకు స్వర్ణ రథం ఉరేగింపు నిర్వహిస్తారు ద్వాదశి పర్వదినం రోజున వేకువజామున 4 గంటలకు చక్రస్నానం కార్యక్రమం నిర్వహించనున్నారు.

సర్వదర్శనం టికెట్లు పొందాలంటే
పది రోజులు పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణకు నిర్ణయించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జనవరి 2న ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేసారు. తిరుపతిలో జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభించే సర్వదర్శన కౌంటర్లను 24 గంగలు తెరిచే ఉంచుతారు. టికెట్లు పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటాయి. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజు స్వామి సత్రం, ఎమ్మార్ పల్లి జెడ్పీ హైస్కూల్, మున్సిపల్ ఆఫీసు, రామచంద్ర పుష్కరిణి, రామానాయుడు స్కూల్, జీవకోన జెడ్పీ హైస్కూల్ తో పాటుగా తిరుమలలోని కౌస్తుభం వద్ద సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనునున్నారు.
-
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications