• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వకీల్ సాబ్ వకీల్ సాబే..పవన్ కల్యాణ్ పవన్ కల్యాణే: జనసేనాధీశుడి విచిత్ర పరిస్థితి

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా 20 రోజుల ముందు విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్.. పవన్ కల్యాణ్ స్టామినా ఏమిటో మరోసారి ప్రపంచం మొత్తానికీ చాటి చెప్పింది. వకీల్ సాబ్ ట్రైలర్‌ను చూడటానికి పవన్ కల్యాణ్ అభిమానులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. దీనికి నిదర్శనమే విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఉదంతం. థియేటర్ అద్దాలు పగలి మీద పడినప్పటికీ.. అభిమానులు లెక్క చేయలేదు. రక్తమోడుతోన్నశరీరాలతోనే వకీల్ సాబ్ ట్రైలర్‌ను తిలకించారు. గాయాలు మిగిల్చిన బాధను మరిచిపోయారు. అది- టాలీవుడ్ హీరోగా పవన్ కల్యాణ్‌కు ఉన్న సత్తా.

ఫైనాన్షియర్లందరూ బీజేపీలోకి: టీడీపీకి నిధుల కొరత: తిరుపతి ఖర్చెవరు భరిస్తారట?ఫైనాన్షియర్లందరూ బీజేపీలోకి: టీడీపీకి నిధుల కొరత: తిరుపతి ఖర్చెవరు భరిస్తారట?

కోట్లల్లో వ్యూస్..

కోట్లల్లో వ్యూస్..

వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల వ్యవధిలో కోట్లల్లో వ్యూస్ లభించాయి. లక్షల్లో కామెంట్స్ పడ్డాయి. వేల సంఖ్యలో డౌన్‌లోడ్స్ రికార్డ్ అయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా నిలిచింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఈ ట్రైలర్‌కు లభించిన వ్యూస్ 1,43,15,547. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన బాహుబలి-ది కన్‌క్లూజన్‌ ట్రైలర్ కంటే.. దీనికి లభించిన వ్యూస్ అధికం. వకీల్ సాబ్ రీమేక్ అయినప్పటికీ.. పవన్ కల్యాణ్ అనే ఒక్క పేరు చిత్ర పరిశ్రమను షేక్ చేసి పారేసింది.

 రాజకీయాల్లోకి వచ్చేసరికి..

రాజకీయాల్లోకి వచ్చేసరికి..

పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ హీరోగా.. ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారనడానికి తాజాగా చోటుచేసుకున్న ఉదాహరణ.. వకీల్ సాబ్ ట్రైలర్. ఇన్ని లక్షలు, కోట్ల మంది అభిమానులు పవన్ కల్యాణ్‌ను ఓ సినీ హీరోగానే ఆదరిస్తున్నారా? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. ఏడేళ్లుగా పవన్ కల్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రత్యేకించి 2019 సాధారణ ఎన్నికలకు రెండేళ్లు ముందు నుంచీ ఆయన క్రీయాశీలక రాజకీయాల్లో మెరుపులు మెరిపిస్తున్నారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొని ఎన్నికల్లో పోటీ చేయడం అసాధారణ విషయం.

ఆదరణ అంతంతే..

ఆదరణ అంతంతే..

వైసీపీ, టీడీపీ వంటి బలమైన పార్టీలను ఢీ కొడుతూ.. కోట్ల సంఖ్యలో ఉన్న తన అభిమానులను నమ్ముకుని పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోగా అందుకున్న సంచలన విజయాలను ఆయన రాజకీయాల్లో దొరకబుచ్చుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లో ఓడిపోవడం.. దీనికి అద్దం పడుతోంది. ఎన్నికలు ముగిసిన 22 నెలల కాలంలోనూ ఆయన నెలకొల్పిన జనసేన పార్టీ పెద్దగా పుంజుకోలేదనడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఉదాహరణ.

ఛరిష్మా ఏమైనట్టు..

ఛరిష్మా ఏమైనట్టు..

సినిమా హీరోగా పవన్ కల్యాణ్‌కు బ్రహ్మరథం పడుతోన్న కోట్లాది మంది అభిమానులు.. ఓ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఆయననను అక్కున చేర్చుకోలేకపోతున్నారనేది చేదు నిజం. వకీల్ సాబ్‌ ట్రైలర్‌కు లభించిన వ్యూస్ స్థాయి ఓట్లు కూడా ఆయన పార్టీకి పడట్లేదు. ఈ పరిణామాల మధ్య తిరుపతి లోక్‌సభ స్థానానికి నిర్వహించునున్న ఉప ఎన్నిక.. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సత్తాకు మరోసారి అగ్నిపరీక్షను పెట్టనున్నాయి. వకీల్ సాబ్‌కు లభించిన వ్యూస్, కామెంట్స్ స్థాయి ఓట్లయినా పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని రత్నప్రభకు పడతాయా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.

 సోషల్ మీడియాలో భారీ డిబేట్..

సోషల్ మీడియాలో భారీ డిబేట్..

వకీల్ సాబ్ ట్రైలర్ చూడటానికి అభిమానులు చూపిన ఆరాటంలో కనీసం 20 శాతం పార్టీ మీద ప్రదర్శించినా ఆయనకు పడే ఓట్లు భారీగా ఉంటాయనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. 20 శాతం మేర ఓట్లు పోల్ అయి ఉంటే పవన్ కల్యాణ్ ఇప్పటికే ఎమ్మెల్యే అయి ఉండేవారనే వాదన వినిపిస్తోంది. ఏ అభిమానులనైతే చూసి, ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో.. అదే అభిమానులు పవన్ కల్యాణ్‌ను సినిమా హీరోగా మాత్రమే చూస్తున్నారు తప్ప.. రాజకీయ నేతగా కాదనేది స్పష్టమౌతోందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌పై నేరుగా తమ అభిమానాన్ని చూపి ఉంటే ఆయన పరిస్థితి ఇలా ఉండేది కాదని అంటున్నారు.

English summary
Jana Sena Party Chief Pawan Kalyan upcoming movie Vakeel Saab triailer set new record in the views, leads Interesting and new debate on social media in the row of Tirupati Lok Sabha by election, which is all set going polling on April 17.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X