Credit Suisse: ప్రత్యర్థి బ్యాంకును కొనుగోలు చేస్తున్న UBS.. ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో..

Credit Suisse: అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం ఖండాతరాలను తాకింది. ఈ క్రమంలో యూరప్ లోని స్విట్జర్లాండ్ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన Credit Suisse Group AGని తాకింది. ఈ క్రమంలో స్టాక్ ధర భారీగా ఇటీవల పతనం కావటం మనందరికీ తెలిసిందే. సెంట్రల్ బ్యాంక్ సైతం సంక్షోభం ఉన్న క్రెడిట్ సూయిస్ కు నగదు సాయం అందించింది.

ఈ క్రమంలో క్రెడిట్ సూయిస్ బ్యాంకును కొనుగోలు చేసేందుకు యూబీఎస్ గ్రూప్ ముందుకొచ్చింది. ఇది స్విట్జర్లాండ్ లో అతిపెద్ద బ్యాంకింగ్ గ్రూప్. అయితే ఈ చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని కుదిర్చేందుకు అక్కడి ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించినట్లు వెల్లడైంది.

UBS bank agreed to buy Crisis hit Credit Suisse bank in Europe, know details

ఆల్-షేర్ డీల్ మార్చి 17న ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి క్రెడిట్ సూయిస్‌కి దాని ముగింపు ధరలో నాలుగింట ఒక వంతు ధరను నిర్ణయించింది. క్రెడిట్ సూయిస్ విలువ సుమారు 8 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఇందులో నాలుగోవంతుకు అంటే 2 బిలియన్ డాలర్ల విలువకు యూబీఎస్ కొనుగోలు చేయనున్నట్లు అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. డ్యుయిష్ బ్యాంక్ సైతం కొన్ని ఆస్తులను కొనుగోలు చేయాలని చూస్తోందని సమాచారం.

ఈ డీల్ విషయంలో అమెరికా అధికారులు సైతం స్విస్ బ్యాంక్ ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నారు. పరిస్థితులను వేగంగా గాడిలోకి తీసుకురావటం ద్వారా ఇన్వెస్టర్లు, కస్టమర్లలో ధైర్యం నింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆసియా మార్కెట్లు తిరిగి తెరుసుకునే సమయానికి డీల్ పూర్తి చేయాలని వారు కోరుకుంటున్నారు. క్రెడిట్ సూయిస్ విభాగాల మూసివేత ఖర్చులతో పాటు సంభావ్య వ్యాజ్యల ఛార్జీలను UBS కవర్ చేస్తుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

క్రెడిట్ సూయిస్ ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక టాప్ 30 బ్యాంకుల్లో ఒకటిగా ఉంది. దాదాపు 167 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన బ్యాంక్ అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంక్ పతనం తర్వాత కుప్పకూలింది. ఈ క్రమంలో షేర్ విలువను భారీగానే కోల్పోయింది. ఈ లిక్విడిటీ క్రంచ్ నుంచి బ్యాంకును కాపాడేందుకు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ 54 బిలియన్ డాలర్ల మూలధన సాయాన్ని అందించింది. ఈ క్రమంలో అమెరికా దిగ్గజం బ్లాక్ రాక్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని వార్తలు వచ్చినప్పటికీ.. చివరికి యూబీఎస్ బ్యాంక్ కంపెనీని చేజిక్కించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+