• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇసుక అక్రమంగా అమ్మితే కఠిన శిక్ష: ఇంగ్లీషు మీడియంపైన ముందుకే: ఏపీ కేబినెట్ నిర్ణయాలు..!

|

ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇసుక సరఫరా ప్రధాన అంశంగా చర్చ జరిగింది. ఇసుక అంశం మీద ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో ఉన్న చట్టంలో సవరణలు చేస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుక అక్రమ రవాణా కు పాల్పడేవారికి గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ చేసిన చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే పది రోజుల్లోగా పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని సీఎం ఆదేశించారు. ఇక, రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని అమలు చేయాలని తీర్మానించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక ఐఏయస్ అధికారిని నియమించారు. మార్కెట్ కమిటీలు.. ఆలయ పాలక మండళ్ల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇన్ ఛార్జ్ మంత్రులకు ఈ బాధ్యతలు అప్పగించారు.

నవంబర్‌ 14 నుంచి ఇసుక వారోత్సవాలు: సెలవులు రద్దు...అక్రమ రవాణపై కఠిన చర్యలు: సీఎం జగన్..!నవంబర్‌ 14 నుంచి ఇసుక వారోత్సవాలు: సెలవులు రద్దు...అక్రమ రవాణపై కఠిన చర్యలు: సీఎం జగన్..!

ఇసుక మీద కేబినెట్ లో కీలక చర్చ...
ఇసుక వ్యవహారం మీద మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఇసుక కొరత తీర్చేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లక్షన్నార టన్నుల ఇసుక ను రెండు లక్షల వరకు పెంచాలని సీఎం ఆదేశించారు. అదే విధంగా రెవిన్యూ..మైనింగ్..పోలీసు అధికారులు పూర్తిగా ఈ అంశం మీద పని చేయాలని సూచించారు. పది రోజుల్లోగా ఇసుక సమస్య అనేది వినబడకూడదని నిర్ధేశించారు. అదే విధంగా అక్రమంగా ఇసుక నిల్వ చేసినా..విక్రయించినా..అక్రమ రవాణా చేసినా కఠిన శిక్షలకు అనుకూలంగా చేసిన చట్ట సవరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అందులో గతంలో కేవలం రెండు లక్ష ల జరిమానా మాత్రమే ఉండేది.తాజాగా రెండేళ్లు జైలు శిక్ష పడేలా చట్ట సవరణ చేసారు. దీంతో పాటుగా.. ఇసుక అక్రమ రవాణా కు పాల్పడేవారికి గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ చట్ట సవరణకు ఆమోద ముద్ర వేసారు.

Ap cabinet approved act amendment in sand policy.. decided to go forward in English medium

ఇంగ్లీషు మీడియం పైన ముందుకే వెళ్లాలని..
ప్రపంచంలో పోటీని తట్టుకోవాలంటే ఖచ్చితంగా చిన్న వయసులోనే ఆంగ్ల విద్య నేర్పించాల్సిన అవసరం ఉందని ఏపీ కేబినెట్ అభిప్రాయపడింది. ఈ విధానం కార్యక్రమం కాదు.. సంస్కరణ అని మంత్రులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తెలుగు లేదా ఉర్దూ తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని పర్యవేక్షించేందుకు ఒక ఐఏయస్ అధికారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ నెలాఖరులోగా పాలక మండళ్లను భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. పట్టణాల్లో అక్రమ లే అవుట్ల క్తమబద్దీకరణకు క్యాబినెట్ ఆమోదించింది. కనీసం 37 అడుగుల రోడ్డు ఉండే లే అవుట్ల క్రమబద్దీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విస్తీర్ణం ఆధారంగా పెనాల్టీ విధించి క్రమబద్దీకరణ చేయాలని నిర్ణయించారు. 2018 లో ఇచ్చిన నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కొత్తగా ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, పరిశ్రమల నుంచి వ్యర్థాల సేకరణ నుంచి డిస్పోజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. పాలక మండళ్ల భర్తీ, రిజర్వేషన్ల అమలు బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు.

English summary
Ap cabinet apporved act ammendement in sand policy. Govt decided to go forward in English medium schools in primary education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X