లీజులో స్వర్ణ ప్యాలెస్ హోటల్: కోవిడ్ ఆసుపత్రిగా: ప్రమాదంపై జగన్ ఆరా: వేటు పడుతుందా?
విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు ఆదేశించారు. తక్షణ చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని చెప్పారు.
Recommended Video
విజయవాడకు చెందిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చినట్లు అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరించినట్లు తెలుస్తోంది. లీజుకు తీసుకున్న హోటల్‌లో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో కరోనా వైరస్ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఈ ఘటనపై ఇఫ్పటికే విజయవాడకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని ఆయన అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. లీజుకు తీసుకున్న హోటల్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం అనుమతులను తీసుకుందా? లేదా? అనే విషయంపై ఆరా తీయాలని అన్నారు.
విజయవాడ: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుమంది మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. 30 మంది కరోనా వైరస్ పేషెంట్లను ఇతర కోవిడ్ సెంటర్‌లో చేర్చారు. ఈ ఘటన పట్ల విజయవాడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications