విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసింది వీరే: 4070 ఎకరాలు ముందే కొన్నారు: సభలో ప్రకటించిన ప్రభుత్వం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధానిలో చంద్రబాబు ప్రభుత్వ హాయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిదంటూ చాలా కాలంగా ఆరోపిస్తున్న వైసీపీ..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత సేకరించిన సమాచారాన్ని సభ ముందు ఉంచింది. రాజధాని పైన సభలో వాడి వేడి చర్చ సాగింది. దీని పైన చంద్రబాబు రాజధానిలో తమ విధానం సమర్ధించుకొనే ప్రయత్నం చేసారు. తమ నిర్ణయాలు అమలు గురించి వివరించారు. ఆ తరువాత మంత్రి బుగ్గన నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం నుండి..రాజధాని ప్రకటన మధ్య కాలంలో ముందుగానే అక్కడ భూములు కొనుగోలు చేసిన వారి పేర్లను బయట పెట్టారు. ఏపీ రాజధానిగా ప్రకటించకముందే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 4070 ఎకరాల ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. అందులో హెరిటేజ్ సంస్థతో పాటుగా నాటి మంత్రులు.. పార్టీ నేతల ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

 407 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది..

407 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది..

ఏపీలో చంద్రబాబు 2014 జూన్ 8న ప్రమాణ స్వీకారం చేసారని..అప్పటి నుండి డిసెంబర్ 2014 లో ప్రభుత్వం అధికారికంగా రాజధాని ప్రకటించే సమయం వరకూ ..రాజధాని ఎక్కడో తెలియదని అయితే, టీడీప నేతలు మాత్రం ముందుగానే అక్కడ భూములు కొనుగోలు చేసారని మంత్రి బుగ్గన ఆరోపించారు. మిగిలిన వారికి తెలియని విషయం..ఎక్కడో అనంతపురం లాంటి ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నేతలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. నాడు తొలుత నూజివీడు రాజధానిగా ప్రకటించి..తమ పార్టీ నేతలతో మాత్రం రాజధాని ప్రాంతం ఏదో చెప్పి..అక్కడ భూములు కొనుగోలు చేసేందుకు సహకరించారని వివరించారు. అలా మొత్తంగా తమ విచారణలో ఇప్పటి వరకు 4070 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా తేలిందన్నారు. అందులో ప్రధానంగా హెరిటేజ్ సంస్థకే 14.22 ఎకరాలు స్థలం ఉందన్నారు. అదే విధంగా పలువురు మంత్రులు..వారి బినామీలు ఉన్నట్లుగా గుర్తించామని చెప్పుకొచ్చారు.

భూములు ముందుగానే కొనుగోలు చేసిన వారిలో..

భూములు ముందుగానే కొనుగోలు చేసిన వారిలో..

ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటూ ప్రభుత్వం ప్రకటించిన వారి పేర్లలో మాజీ మంత్రి నారాయణ తన కుటుంబ సభ్యులు..సంస్థల ఉద్యోగుల పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేసారన్నారు. అదే విధంగా మాజీ మంత్రులు పుల్లారావు.. అల్లుడు పేరుతో పరిటాల సుతీ..తమ సంస్థ పేరుతో రావెల కిషోర్ బాబు.. కొమ్మాలపాటి శ్రీధర్...జీవీ ఆంజనేయులు..పయ్యావుల కేశవ్..వేమూరి రవిప్రసాద్ కొనుగోలు చేసిన స్థలం వివరాలను వెల్లడించారు. అదే విధంగా ధూళిపాళ్ల నరేంద్ర మొత్తం 17.13 ఎకరాలు కొనుగోలు చేసారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న భవన యజమాని లింగమనేని రమేష్ రాజధాని ప్రాంతంలో ముందుగానే 351 ఎకరాలు కొనుగోలు చేసారని చెప్పుకొచ్చారు. పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడి పేరుతో.. రాజధాని ప్రకటనకు ముందుగానే తక్కువ ధరకు స్థలాలు కొనుగోలు చేసారని సభలో మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు.

 బాలయ్య వియ్యంకుడు కోసం..

బాలయ్య వియ్యంకుడు కోసం..

ఫోన్ ద్వారా 1400 మంది అభిప్రాయం తీసుకొని రాజధాని ఖరారు చేసారన్నారు. బాలక్రిష్ట వియ్యంకుడి కోసం 499 ఎకరాలు కారు చౌకకు ఇచ్చి..ఆ తరువాత సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చారని మంత్రి బుగ్గన వివరించారు. తొలుత వారికి కావాల్సిన భూములను కేటాయించటం..ఆ తరువాత అనేక సార్లు సీఆర్డీఏ పరిధిని విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక, అసైన్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసిన వారి జాబితాను మంత్రి బుగ్గన చదివి వినిపించారు. అందులో మాజీ మంత్రి లోకేశ్ సన్నిహితులు ఉన్నారని వారి పేర్లు ప్రస్తావించారు. ఇక, అనేక మంది పేర్లను మంత్రి సభలో చదివి వినిపించారు. ఆర్బీఐ..ఎస్బీఐ లాంటి వాటికి ఎకరా కోటి రూపాయాలకు కేటాయించిన నాటి ప్రభుత్వం తమకు కావాల్సిన వారికి మాత్రం లక్షల్లోనే కేటాయించిందని చెప్పుకొచ్చారు.

English summary
AP Govt announced list of TDp leader who purchased lands in capital before annoucement. govt saying that previous govt done insider trading with farmer lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X