విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతి పార్లమెంట్‌నియోజకవర్గానికి ఓ స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్...తిరుపతిలో యూనివర్శిటి.. సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఏపీలో అదనంగా 25 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కిల్ డెవెలప్‌మెంట్ అధికారులతో సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయడంతో పాటు ఓ యూనివర్శిటీని కూడ ఏర్పాటు చేయాని సీఎం అధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలోనే తిరుపతిలో స్కిల్‌డెవలప్‌మెంట్‌ యూనివర్శిటీ, విశాఖపట్నంలో హైఎండ్‌ స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Kadapa:కడపలో హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్: జగన్ సొంత జిల్లా పర్యటనపై అందరి కళ్లూ: రూ.5000కోట్ల పైమాటేKadapa:కడపలో హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్: జగన్ సొంత జిల్లా పర్యటనపై అందరి కళ్లూ: రూ.5000కోట్ల పైమాటే

ఉద్యోగాలకు అనుగుణంగా శిక్షణ

ఉద్యోగాలకు అనుగుణంగా శిక్షణ

ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాక్రమాలన్నింటీని ఒకే గొడుగు క్రిందకు తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. దీని ద్వార ఆయా సంస్థల పర్యవేక్షణతో పాటు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని సీఎం పేర్కోన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలనే వాటిపై యూనివర్శిటి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రం చూసి ఉద్యోగం ఇచ్చేలా అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వాలన్నారు. స్థానిక పరిశ్రమలు, వారి అవసరాలను గుర్తించి ఆ మేరకు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

 ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ

ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ

స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒకటి లేదా రెండు పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, మరోవైపు ప్రస్తుతం ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలను నైపుణ్యాభివృద్ది కేంద్రాలుగా మార్చాలని సీఎం కోరారు. ఇక ఈ కాలేజీల్లో ఏ కోర్సులు, ఎలాంటీ శిక్షణ లభిస్తాయో విద్యార్థుల్లో పూర్తి అవగవాన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇంజనీరింగ్ , మరియు డిప్లోమో , ఐఐటీ లాంటీ సాంకేతిక కోర్సులు చేసిన వారికి మరింత స్కిల్స్ ఇప్పించేందుకు యూనివర్శిటీ కేంద్రాలను అభివృద్ది చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు.

ఉద్యోగాలు వచ్చేలా చర్యలు

ఉద్యోగాలు వచ్చేలా చర్యలు


రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి స్కిల్స్‌ను ఇక్కడ నేర్పించేందుకు అధికారులు ప్రణాళికను తయారుచేయాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నైపుణ్యభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిస్థాయి సమీక్ష చేసి.. వీటి ద్వారా నిజంగా పిల్లలు లబ్ధి పొందుతున్నారా? లేక మాటలకు మాత్రమే పరిమితం అవుతుందా? అన్నది పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. 2100 చోట్ల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికారులు వివరించగా వీటిపై పూర్తిస్థాయి పరిశీలన చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

English summary
The government has decided to set up an additional 25 Skill Development Centers in AP. CM Jagan held a review meeting with the Skill Development Officers at his camp office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X