విజయవాడలో జోరుగా పోలింగ్‌- పడమటలంకలో ఓటేసిన పవన్ కళ్యాణ్‌

విజయవాడలో కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరంలో పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.

విజయవాడలోని పటమటలంక పోలింగ్ బూత్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పడమటలో నివాసం ఉంటున్న పవన్‌కు ఎన్నికల అధికారులు ఇక్కడే ఓటు కేటాయించారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పవన్ ఓటేయడం ఇదే తొలిసారి. ఓటేసేందుకు పడమటలంకలో పోలింగ్ కేంద్రానికి పవన్‌ వస్తారన్న సమాచారంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. పవన్‌ రాగానే భారీ ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాసేపు హడావిడి నెలకొంది.

ap municipal elections polling on pace in vijayawada, pawan kalyan caste his vote

విజయవాడ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహిళలు, వికలాంగులు కూడా పోలింగ్ కేంద్రాలకు ఉదయమే తరలివచ్చారు. దీంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ కార్పోరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ఇరుపార్టీలకు చావోరేవోలా మారిపోయాయి. దీంతో ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు తరలించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+