Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుజనా చౌదరి,సిఎం రమేష్ లను అనర్హులుగా ప్రకటించండి!...ఎథిక్స్‌ కమిటీకి ఎంపి జివిఎల్ ఫిర్యాదు

విజయవాడ:టిడిపి రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లను అనర్హులుగా ప్రకటించాలంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

అసలు ఎథిక్స్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న టిడిపి ఎంపి సుజనా చౌదరి పైనే దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నందున ఆయనపై ఎంపీగా కొనసాగే నైతిక అర్హత లేనే లేదని జివిఎల్ వాదిస్తున్నారు. బిజెపి ఎంపి జివిఎల్ గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ టిడిపి ఎంపీలపై తాను ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని వెల్లడించారు.

BJP MP GVL complaint to ethics committee against Sujana Chowdary, CM Ramesh

ఐటీ, ఈడీ దాడుల్లో తమ పార్టీ నేతల అవినీతి వెలుగుచూస్తున్నా ఆ పార్టీ అధినేత, ఎపి సీఎం చంద్రబాబు నిసిగ్గుగా వారిని సమర్థిస్తున్నారని జివిఎల్ దుయ్యబట్టారు. చంద్రబాబు తీరు చూస్తుంటే తన బినామీలను కాపాడుకునే చందంగా ఉందని విమర్శించారు. టీడీపీ ఎంపీల అవినీతిని చూసి ప్రజలు విస్మయం చెందుతున్నారని ఎంపి జివిఎల్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతల తీరు ఆలీబాబా 40 దొంగలు లాగా ఉందన్నారు.

తెలుగుదేశం పార్టీ అంటే దొంగల పార్టీ అని ​ ప్రజలకు తెలిసిపోయిందని జివిఎల్ వ్యంగాస్త్రాలు సంధించారు. టిడిపి నేతలు లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటే అలాంటి వారిని సంజాయిషీ అడగకూడదా?...ఇదేం తీరని జివిఎల్ నిలదీశారు. అసలు రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం విశ్వసనీయత లేదని జివిఎల్ ధ్వజమెత్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+