‘అయ్యా జగన్ గారూ మీకూ బుద్ధి చెబుతారు’

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో ఉంది ఆ రాష్ట్ర సర్కారు. ప్రజావేదికతో మొదలు పెట్టిన నిర్మాణాల కూల్చివేత ఇప్పుడు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వరకు వచ్చింది. అప్పటికే నోటీసులు జారీ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కూల్చివేతకూ సిద్ధమైంది. దీంతో ప్రతిపక్ష నేతలు సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు.

చంద్రబాబు ఇంటిని కూడా..

చంద్రబాబు ఇంటిని కూడా..

కృష్ణానది కరకట్టపై ఉన్న భవనాలను తొలగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కరకట్టపై ఉన్న మరికొన్ని భవనాలను కూడా తొలగించింది. ఇక చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా కూల్చివేతకు సిద్ధమైంది ఏపీ సర్కారు. త్వరలోనే ఈ భవనాన్ని కూడా నేలమట్టం చేస్తుందని ప్రచారం జరుగుతోది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు జగన్ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

మర్చిపోయారా?

మర్చిపోయారా?

తాజాగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అయ్యా @ysjagan బంజారాహిల్స్ రోడ్ నo.2లో మీ భవనాన్ని క్రమబద్ధీకరించారు మర్చిపోయారా? ఇడుపులపాయలో 618 ఎకరాల అసైన్డ్ భూములనీ క్రమబద్ధీకరించుకున్నారు గుర్తులేదా ? ఇప్పుడు మీ పార్టీలోకి చేరకపోతే వాళ్ళవన్నీ అక్రమ కట్టడాలయిపోతాయా ?' అంటూ నిలదీశారు.

బుద్ధి చెబుతారు..

బుద్ధి చెబుతారు..

‘ప్రజల గృహాల్ని కొల్లగొడతారా? ఇది పులివెందుల పంచాయితీనా? ప్రజా పరిపాలనా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారు' అని ఘాటుగా వ్యాఖ్యానించారు బుద్ధా వెంకన్న.

దొంగల ముఠా అంటూ..

దొంగల ముఠా అంటూ..

ఇటీవల విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని బుద్ధా వెంన్న తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సాయం చేశారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో విజయసాయిరెడ్డి దాఖలు చేసిన నామినేషన్‌పై అభ్యంతరాలు తెలుపుతూ ఫిర్యాదులు అందాయి. ఆ సమయంలో కోడెలను విజయసాయిరెడ్డి సాయం కోరారు. దీంతో ఆయన రిటర్నింగ్ అధికారితో మాట్లాడి విజయసాయి నామినేషన్ ఆమోదింపజేసేలా చేశారని సోషల్ మీడియాలో కొందరు మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. ‘కోడెల గారి మీద కేసు పెడితే సాయం చేస్తా అని నువ్వు పెట్టిన ట్వీట్లు ప్రజలంతా చూసారు. ఇప్పుడు వచ్చి కోడెలగారి మరణాన్ని తెదేపా వాళ్ళు రాజకీయం చేస్తున్నారని నంగనాచి కబుర్లు చెప్పకు. నువ్వు నీ దొంగల ముఠా వేధింపులవల్లనే పులిలా బ్రతికిన కోడెల ఆత్మహత్య చేసుకున్నారు' అని బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+