సీఎం సీటుకే ఎసరు పెట్టారుగా!: విజయసాయిరెడ్డిపై బుద్ధా సంచలనం, ‘లోకేష్ అంటే జగన్‌కు భయం’

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సీబీఐ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, టీడీపీ నేత నారా లోకేష్ లతోపాటు బుద్ధా వెంకన్నపైనా విజసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన కూడా విమర్శలు ఎక్కుపెట్టారు.

సీఎం సీటుకే ఎసరంటూ..

‘ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన బుద్ధా వెంకన్న.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఇంత కాలం విజయసాయి రెడ్డి ఢిల్లీలో తిప్పిన చక్రం వెనకున్న రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోయామన్నారు. మీ వాడి(వైఎస్ జగన్మోహన్ రెడ్డి)ని లోపల వేయించి సీఎం కూర్చీని కొట్టేయాలని ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారుగా సాయిరెడ్డి గారూ అంటూ ట్వీట్ చేశారు బుద్ధా వెంకన్న. 16 సంవత్సరాల శిక్షలో 16 నెలలు పోతే ఎంతో లెక్కల మాస్టారు కాబట్టి మీరే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు '

నవర్నత తైలం రాస్తున్నారుగా..

నవర్నత తైలం రాస్తున్నారుగా..

‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అంటూనే 1300 కోట్లు ఖర్చుతో స్మశానాలకు కూడా పార్టీ రంగులు వేసుకుంటున్న వాడిని ఏమి అంటారు @VSReddy_MP గారు? ఒకవైపు రాష్ట్రం లోటులో ఉంది, అందుకే నవరత్నాల బదులు నవరత్న తైలం రాస్తున్నాం అని సొల్లు కబుర్లు చెప్తున్నారు' అంటూ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు.

జగన్ తింగమరి మాలోకం కాదా.

జగన్ తింగమరి మాలోకం కాదా.

‘ఇంకోవైపు వందల కోట్ల ప్రజా ధనాన్ని మీ సొంత మీడియా పరివారాన్ని మేపడానికి దోచుకుంటున్నారు. ఇలాంటి తలతిక్కపనులు చేసేవాడిని వాడిని తింగరి మాలోకం @ysjagan అనక పోతే ఏమి అనాలి విజయసాయిరెడ్డి గారు!! ఒకవైపు ఇసుక దొరక్క, ఉపాధి కోల్పోయి ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంట్లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ, నెట్ ఫ్లిక్స్‌లో సినిమాలు చూస్తూ నిద్రపోతున్న మీ తింగరి మాలోకం @ysjagan ని కాస్త నిద్రలేపి ఆయన ఈ రాష్ట్రానికి షీఎం అని గుర్తు చెయ్యండి @VSReddy_MP గారు!!' అంటూ టీడీపీ ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు.

దొంగ దీక్షలకు పేటెంట్ మీదే..

దొంగ దీక్షలకు పేటెంట్ మీదే..


‘దోంగ దీక్షలు చెయ్యడంలో మీ తింగరి మాలోకం @ysjaganకి పీహెచ్డీ వచ్చిన విషయం మర్చిపోయారా @VSReddy_MP గారు? చెవులు చిల్లులు పడేలా బిల్డప్ సాంగులు, సొంత డబ్బాలో గ్రాఫిక్స్ మనుషులు, ప్రత్యేక బస్సులో దొంగ మేత అన్నీ ప్రజలకు తెలిసిన నిజాలే కదా. ఇక పాదయాత్ర అంటావా అదో భరించలేని అద్భుతం...
రోజుకి 3 కిలోమీటర్ల నడక ,కేసుల పేరుతో వారానికి రెండు రోజులు లోటస్ పాండ్‌లో విలాసం..ఆహా ఓహో!. దొంగ దీక్షలకు మీరు పేటెంట్ కలిగిన మాస్టారు అన్న విషయం గుర్తు పెట్టుకొని, దయచేసి ప్రజా సమస్యలను అపహాస్యం చెయ్యెదని మిమ్మల్ని కోరుతున్నా విజయసాయిరెడ్డి గారు!' అని బుద్దా వ్యాఖ్యానించారు.

లోకేష్ అంటే ఆ మాత్రం భయముండాలి..

లోకేష్ అంటే ఆ మాత్రం భయముండాలి..


‘ఐదు నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యి రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఏకం చేసిన మీ @ysjaganని తింగరి మాలోకం అంటే ఎక్కడ ఉద్యోగం పీకేస్తాడో అన్న భయంతో లోకేష్ మీద రెచ్చిపోతున్నారు కదా @VSReddy_MP గారు.!! ఆ భయంతో ఎం చెయ్యాలో తెలియక నిద్రలేచింది మొదలు లోకేష్ కి ఏమీ చేతకాదు అంటూ లోకేష్ పేరు జపం చేస్తున్నావ్ అంటే లోకేష్ ని చూసి ఎంత భయపడుతున్నావో అర్థం అవుతుంది వీసా గారు!! తప్పుడు పనులు చేసేవాళ్ళకి నిజాయితీగా బ్రతికే లోకేష్‌ని చూస్తే ఆమాత్రం భయం ఉండాలిలే!!' అంటూ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+