విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్ర‌బాబు రాజీనామా : ఆమోదించిన గ‌వ‌ర్న‌ర్ : జ‌గ‌న్‌..మోదీకి అభినంద‌న‌లు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Results 2019 : గెలుపోటములు సహజం... త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ : చంద్రబాబు || Oneindia

ఏపీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి చంద్ర‌బాబు రాజీనామా చేసారు. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌టం.. వైసీపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించటంతో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను నేరుగా గ‌వ‌ర్న‌ర్‌గా పంపగా..ఆయ‌న ఆమోదించారు. త‌దుప‌రి ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కూ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగాల‌ని గ‌వ‌ర్న‌ర్ చంద్ర‌బాబుకు సూచించారు. ఎన్నిక‌ల్లో గెలిచిన జ‌గ‌న్‌..మోదీల‌కు చంద్ర‌బాబు అభినంద‌న‌లు తెలిపారు.

రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్ రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్

చంద్ర‌బాబు రాజీనామా..

ఏపీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి చంద్ర‌బాబు రాజీనామా చేసారు. ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌వ్వ‌టం.. వైసీపీ అధికారం ద‌క్కించుకోవ‌టంతో చంద్ర‌బాబు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసారు. నేరుగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు త‌న లేఖ‌ను పంపారు. ఏపీలో వ‌చ్చిన ఫ‌లితాల కార‌ణంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్త‌న్నాన‌ని..ఆమోదించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను లేఖ‌లో చంద్ర‌బాబు అభ్య‌ర్దించారు. త‌న వ‌ద్ద‌కు చేర‌గానే గ‌వ‌ర్న‌ర్ నేరుగా చంద్ర‌బాబుకు ఫోన్ చేసారు. రాజ‌కీయాల్లో ఆటు పోట్టు స‌హ‌జ‌మ‌ని..మీరు ఏపీకి అందించిన సేవ‌లు ఎప్పటికీ గుర్తుండిపోతాయ‌ని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంసించారు. ఇదే స‌మ‌యంలో కొత్త ప్ర‌భుత్వం బాధ్య‌త‌లు తీసుకొనే వ‌ర‌కూ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగాల‌ని గ‌వ‌ర్న‌ర్ కోరారు. మిష‌న్ 150 ప్ల‌స్ పేరుతో ఎన్నిక‌ల్లోకి దిగిన చంద్ర‌బాబు..ఆశించిన అంచ‌నాలు త‌ల కిందుల‌య్యాయి. టీడీపీ క‌నీసం పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. పట్టుమ‌ని 25 సీట్లు సాధించటం క‌ష్టంగా మారింది.

అయిదేళ్ల కాలంలో చంద్ర‌బాబు..

అయిదేళ్ల కాలంలో చంద్ర‌బాబు..

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌వ్యాంధ్ర తొలి ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు గెలిచారు. 2014 జూన్ 8న ప్ర‌మాణ స్వీకారం చేసారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఖ‌రారు..నిర్మాణాలు..పోల‌వ‌రం వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టులు చేప‌ట్టారు. రాజ‌కీయంగా త‌మ‌కు పోటీ లేద‌నే అతి విశ్వాసం టీడీపీని దెబ్బ తీసింది. ఆరోప‌ణ‌లు ఉన్న అభ్య‌ర్దుల‌నే తిరిగి బ‌రిలోకి దించ‌టం..ప్ర‌భుత్వం పైన అవినీతి ఆరోప‌ణ‌లు..వైసీపిని త‌క్కువ అంచ‌నా వేసి కేంద్ర ప్ర‌భుత్వంలో మోదీని అధికారంలోకి అడ్డుకోవ‌టం పైనే చంద్ర‌బాబు ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌టం కూడా మైన‌స్ అయింది. ఇందు కోసం ఢిల్లీలో ఎక్కువ స‌మ‌యం గ‌డిపారు. కానీ, చంద్ర‌బాబు ఆశ‌లు నెర‌వేర‌లేదు. ఏపీలో అధికారం కోల్పోవ‌టం.. కేంద్రంలో మోదీ తిరిగి అధికారంలోకి రావ‌టం ఇప్పుడు చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా పెద్ద దెబ్బ‌గా చెప్పుకోవాలి.

జ‌గ‌న్‌..మోదీకి అభినంద‌న‌లు..

జ‌గ‌న్‌..మోదీకి అభినంద‌న‌లు..

ఫ‌లితాల వెల్ల‌డి త‌రువాత మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో గెలిచిన జ‌గ‌న్‌..మోదీకి చంద్ర‌బాబు అభినంద‌న‌లు తెలిపారు. ప్ర‌జా తీర్పును గౌర‌విస్తామ‌ని చెప్పారు. న‌వీన్ ప‌ట్నాయ‌క్ విజ‌యం ప‌ట్ల అభినంద‌న‌లు చెప్పుకొచ్చారు. ఫ‌లితాల పైన పార్టీలో విశ్లేష‌ణ చేసుకుంటామ‌ని..త్వ‌ర‌లోనే దీనికి గ‌ల కార‌ణాలను క్షేత్ర స్థాయిలో ప‌రిశీల‌న చేసుకుంటామ‌ని వివ‌రించారు. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

English summary
Ap Cm Chandra Babu Resigned and governor accepted his resignation and asked him to continue till the new government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X