విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాడు వైసీపీ ఫార్ములానే నేడు చంద్రబాబు కూడా .. ఉక్కు కోసం సీఎం జగన్, ఎంపీల రాజీనామాకు డిమాండ్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే పలుమార్లు కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తమ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. ఇక తాజాగా ప్రైవేటీకరణకు ఏ ప్రైవేటు సంస్థ ముందుకు రాని నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ను మూసివేస్తామంటూ బెదిరింపులకు సైతం దిగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం జగన్ రంగంలోకి దిగాలని, అది సీఎంగా జగన్ నైతిక బాధ్యత అని గుర్తు చేస్తున్న చంద్రబాబు జగన్ సర్కార్ ను ఇరకాటంలోకి నెడుతున్నారు.

 చంద్రబాబు జోక్యం, అచ్చెన్నాయుడు ఫోన్ .. విజయవాడ టీడీపీ నాయకుల పంచాయితీ ముగిసినట్టేనా ? చంద్రబాబు జోక్యం, అచ్చెన్నాయుడు ఫోన్ .. విజయవాడ టీడీపీ నాయకుల పంచాయితీ ముగిసినట్టేనా ?

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్ రాజీనామా చెయ్యాలని చంద్రబాబు డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ జగన్ రాజీనామా చెయ్యాలని చంద్రబాబు డిమాండ్


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చెయ్యాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. మాయమాటలతో ప్రజల్ని మోసం చేయకుండా, ఇప్పటికైనా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిని కలవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా ప్రయత్నం చేయాలని చంద్రబాబు సూచించారు.

వైసిపికి చెందిన 28 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారు ?

వైసిపికి చెందిన 28 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారు ?

ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 6వ తేదీన మొదటి లేఖ రాశారని, అప్పటినుండి ఇప్పటివరకు వైసిపికి చెందిన ఇరవై ఎనిమిది మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.

పోస్కో ప్రతినిధులతో మాట్లాడి తనకు ఏం తెలియదన్నట్టు అబద్ధం ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి అంగీకరించి ఏపీకి వచ్చి మాట మార్చారని ఆక్షేపించారు .

కేంద్రమంత్రి మాటలతో జగన్ నిజస్వరూపం అర్ధమైంది

కేంద్రమంత్రి మాటలతో జగన్ నిజస్వరూపం అర్ధమైంది

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించటం ఖాయం, రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పగా జగన్ నిజస్వరూపం ఏపీ ప్రజలకు అర్థమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే మరోసారి ప్రధానికి లేఖ రాసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రుల పదవులకు రాజీనామా చేసి టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి బయటకు వచ్చారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ జగన్ రెడ్డి కేంద్రానికి భయపడి కనీసం ఇంటి నుండి కూడా బయటకు రావడం లేదని తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు.

గతంలో ప్రత్యేక హోదా కోసం టీడీపీపై వైసీపీ ఒత్తిడి .. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ రిపీట్

గతంలో ప్రత్యేక హోదా కోసం టీడీపీపై వైసీపీ ఒత్తిడి .. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ రిపీట్

గతంలో ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారని గుర్తు చేసిన చంద్రబాబు, ఇప్పుడు వైసీపీపై అదే తరహా ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందరితో రాజీనామాలు చేయించి కేంద్రంపై పోరాటం సాగించాలని సీఎం జగన్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను నాశనం చేయొద్దని జగన్ కు విజ్ఞప్తి చేస్తున్న చంద్రబాబు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని గతంలో వైసీపీ ఏదైతే ప్రత్యేక హోదా విషయంలో ఎంపీల రాజీనామాపై పట్టు పట్టిందో, అదే పట్టుతో చంద్రబాబు, టిడిపి నేతలు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

English summary
Opposition leader and TDP national president N Chandrababu Naidu demanded Chief Minister YS Jagan Mohan Reddy to tender resignation to the CM post as he failed to stop privatisation of the Visakhapatnam Steel Plant . He asked the CM to meet Prime Minister Narendra Modi and union ministers and prevent them from going ahead with the disinvestment process . Chandrababu flayed 28 YSRCP MPs and 151 MLAs for not making efforts to stop the VSP privatisation from the day (February 6) CM wrote a letter to the Central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X