విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొడాలిపై పోరుకు టీడీపీలో పోటా పోటీ ? రావి వర్సెస్ రాము ! చంద్రబాబు ఓటు ఎవరికి ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా హాట్ సీట్ గా మారబోతున్న నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి. ముఖ్యంగా అధికార వైసీపీలో కొడాలి నాని రూపంలో బలమైన అభ్యర్ధి ఉండటంతో పోటీ లేదు. కానీ విపక్ష టీడీపీలో మాత్రం పరిస్దితి అలా లేదు. కొడాలి నానిని ఓడించే అభ్యర్ధి కోసం చంద్రబాబు ఓవైపు అన్వేషణ సాగిస్తుండగా.. మరోవైపు పార్టీలో ఉన్నవారికి తోడు, కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారు సైతం నిరూపించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. దీంతో వీరిలో ఎవరికి సీటివ్వాలనే అంశంలో చంద్రబాబులో డైలమా కొనసాగుతోంది.

గుడివాడ అసెంబ్లీ పోరు

గుడివాడ అసెంబ్లీ పోరు

ఏపీలో రాజకీయంగా ఎప్పుడూ ఆసక్తిరేపే నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి. గతంలో కొడాలి నానికి ముందు ఎన్టీఆర్ పోటీ, ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయాలు ఆసక్తి రేపేవి. ఆ తర్వాత కొడాలి రాక తర్వాత ఆయన ముందు నిలబడే అభ్యర్దులే కరువయ్యారు. దీంతో గతంలో కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీ అభ్యర్దులకు కొడాలిపై పోటీ అంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. కొడాలిని ఓడించేందుకు గత రెండు ఎన్నికల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీడీపీకి ఎన్నారైలు సైతం భారీగా నిధులిచ్చి సహకరిస్తున్నారు. అయినా కొడాలిపై గెలుపు టీడీపీకి అందని ద్రాక్షగానే మిగులుతోంది. దీంతో ఈసారి టీడీపీ ఎవరికి టికెట్ ఇవ్వబోతోందన్న దానిపై రోజుకో చర్చ నడుస్తోంది.

రంగంలోకి ఎన్నారై రాము

రంగంలోకి ఎన్నారై రాము

గుడివాడలో కొడాలి నానికి ప్రత్యర్ధిగా రంగంలోకి దిగే టీడీపీ అభ్యర్దులకు ఆ పార్టీకి చెందిన ఎన్నారైల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. విదేశాల్లో ఉంటున్నా టీడీపీ గెలుపు కోసం ఆర్ధిక సాయంతో పాటు అన్ని విధాలా సహకరించే ఎన్నారైలకు ఇక్కడ పరిస్ధితులు మాత్రం చేదు అనుభవాలే మిగులుస్తున్నాయి. దీంతో ఈసారి ఇక్కడి మూలాలున్న ఎన్నారై వెనిగండ్ల రాము స్వయంగా తానే బరిలోకి దిగుతున్నారు. సామాజిక సమీకరణాలతో పాటు అంగబలం, అర్ధబలం ఉన్న రాము రంగంలోకి దిగడంతో గుడివాడలో అప్పటివరకూ టీడీపీ రాజకీయాలు నడుపుతున్న నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతోవారు రోజూ తామే టీడీపీ అభ్యర్ధులమని చెప్పుకోవాల్సి వస్తోంది.

రాము వర్సెస్ రావి పోరు

రాము వర్సెస్ రావి పోరు

గుడివాడ సీటులో టీడీపీ తరఫున బరిలోకి దిగే అభ్యర్ధిని చంద్రబాబు ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ అక్కడ కొంతకాలంగా ఇన్ ఛార్గ్ గా ఉంటున్న రావి వెంకటేశ్వరరావు మాత్రం తానే అభ్యర్ధి అని ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్రస్దాయిలో కార్యకర్తలతో కలిసి యాక్టివ్ గా ఉంటున్నారు. కొడాలికి వ్యతిరేకంగా గుడివాడలో టీడీపీ రాజకీయాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మధ్య రంగంలోకి దిగిన ఎన్నారై వెనిగండ్ల రామును ఢీకొట్టి టీడీపీ సీటు తెచ్చుకోవాల్సిన పరిస్దితి ఆయనది. దీంతో గుడివాడలో అభ్యర్ధులమని ఎందరు చెప్పుకున్నా ఫైనల్ గా టికెట్ మాత్రం తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజాగా రంగంలోకి దిగిన ఎన్నారై రాము మాత్రం అధినేతను తన బలాబలాల ఆధారంగా టికెట్ ఇమ్మని కోరుతున్నారు. ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గం కావడం కలిసొచ్చే అంశం. గుడివాడలో ఉండే కమ్మ, ఎస్సీ ఓట్లను తనవైపుకు తిప్పుకునే అవకాశమున్న రాము ఎంట్రీతో రావి వర్సెస్ రాము పోరు మొదలైంది.

చంద్రబాబు ఓటు ఎవరికి ?

చంద్రబాబు ఓటు ఎవరికి ?

గుడివాడలో టీడీపీ అభ్యర్ధుల మధ్య పోటా పోటీ నెలకొన్నప్పటికీ చంద్రబాబు చూపంతా కొడాలి నానిని కొట్టే అభ్యర్ధిపైనా నెలకొంది. ఎన్నికల నాటికి స్ధానిక ఇన్ ఛార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు, విదేశాల నుంచి ఎంట్రీ ఇచ్చిన వెనిగండ్ల రాము ఇద్దరిలో ఒకరు తమను తాము నిరూపించుకుంటే టికెట్ ఇస్తానని చంద్రబాబు తేల్చిచెప్పేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరూ ఇప్పుడు పోటీ పోటీగా గుడివాడలో రాజకీయం మొదలుపెట్టేశారు. రాము భారీగా నిధులు వెదజల్లి స్ధానిక రాజకీయాన్నితనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. స్ధానిక కార్యకర్తలతో ఉన్న పాత సంబంధాలతో రావి వెంకటేశ్వరావు రాజకీయం చేస్తున్నారు. అయితే రావికి కొడాలిని కొట్టే సీన్ లేదన్న వాదన నేపథ్యంలో రాము ఎంట్రీ ప్రాధాన్యంసంతరించుకుంది. అదే సమయంలో ఆయన భార్య సామాజిక వర్గం ఆయనకు కలిసి వస్తోంది. దీంతో చంద్రబాబు చివరి నిమిషంలో ఆయనవైపు మొగ్గినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు.

English summary
tdp chief chandababu is mulling over party candidate in gudivada assembly seat against arch rival kodali nani for 2024 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X