విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ రెడీ చేస్తున్న జగన్- రేపు కీలక భేటీ- అపెక్స్ కౌన్సిల్ వ్యూహం ఖరారు..

|
Google Oneindia TeluguNews

ఏపీలో చేపట్టబోయే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌తో పాటు పలు కీలక ప్రాజెక్టులపై తాడో పేడో తేల్చుకునేందుకు జగన్ సర్కార్ సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్‌ విషయంలో తెలంగాణ సర్కార్ అభ్యంతరాల నేపథ్యంలో దీనికి కౌంటర్ ప్లాన్ రెడీ చేసేందుకు జగన్ వ్యూహరచన చేస్తున్నారు. రేపు జరిగే జలవనరులశాఖ సమీక్షలో త్వరలో ఢిల్లీలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీ అజెండా ఖరారు చేయబోతున్నారు. అదే సమయంలో పిలిచి అన్నం పెడితే కెలికి కయ్యం పెట్టుకుంటున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకూ జగన్ సిద్ధమవుతున్నారు.

 ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ ? కొత్త జిల్లాలపై మౌనం - తెర వెనుక ఏం జరుగుతోంది ? ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ ? కొత్త జిల్లాలపై మౌనం - తెర వెనుక ఏం జరుగుతోంది ?

అపెక్స్ కౌన్సిల్ భేటీ..

అపెక్స్ కౌన్సిల్ భేటీ..


తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాలకు పరిష్కారం చూపేందుకు త్వరలో ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగబోతోంది. దీనికి అజెండాలతో సిద్ధం కావాలని ఇప్పటికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లేఖలు రాశారు. దీంతో ఏపీ, తెలంగాణ రెండూ ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే జలవనరులపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. కేసీఆర్ వ్యాఖ్యలను ఇప్పటికే వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. తమ హక్కుగా ఉన్న నీటిని వాడుకుంటుంటే తెలంగాణ అభ్యంతరాలేంటని ప్రశ్నించారు. దీంతో అపెక్స్ కౌన్సిల్ భేటీ అజెండా ఖరారు కాకముందే ఇరు రాష్ట్రాల మధ్య వాతావరణం వేడెక్కినట్లయింది.

కేసీఆర్ కు కౌంటర్ రెడీ చేస్తున్న జగన్..

కేసీఆర్ కు కౌంటర్ రెడీ చేస్తున్న జగన్..

ఏపీ ప్రభుత్వ పెద్దలను ఇంటికి పిలిచి అన్నం పెడితే వారు కెలికి కయ్యం పెట్టుకుంటున్నారంటూ నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాయలసీమ లిఫ్ట్‌పై ముందుకెళ్తుంటే తెలంగాణ సర్కారు నిద్రపోతోందంటూ విమర్శలు చేలగెరిన నేపథ్యంలో విపక్షాల అంచనాలకు తగినట్లుగానే కేసీఆర్ స్పందించారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ సీరియస్ అయినట్లు సమాచారం. ఆయనకు అదే స్ధాయిలో ఇవ్వబోయే కౌంటర్‌ ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ వ్యాఖ్యలపై పార్టీ పెద్దలతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. గతంలోనే రాయలసీమ లిఫ్ట్‌పై చర్చ మొదలు కాగానే జగన్ దీనిపై ముందుకెళ్లి తీరుతామని స్పష్టత ఇచ్చేశారు. మరోసారి కేసీఆర్ దీనిపై పంచాయతీ మొదలుపెట్టడంతో ఈసారి మరింత గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు జగన్ ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ ప్రాజెక్టులను కేసీఆర్ కెలికిన తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులపై తాము రివర్‌ బోర్డులకు ఫిర్యాదు చేశామనే విషయాన్ని కూడా జగన్ స్పష్టం చేయగల్చుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Andhra Pradesh New Industrial Policy 2020-23 | Oneindia Telugu
రేపు ఇరిగేషన్ సమీక్ష...

రేపు ఇరిగేషన్ సమీక్ష...


కేసీఆర్ నిర్వహించిన ఇరిగేషన్ అధికారుల భేటీలో తమపై వ్యాఖ్యలు చేయడంతో తాను కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా అధికారుల సమీక్షలోనే కేసీఆర్‌కు కౌంటర్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ భేటీలో కేసీఆర్‌కు ఇచ్చే కౌంటర్ తో పాటు అపెక్స్ కౌన్సిల్ భేటీ అజెండా కూడా ఖరారు చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, పోలవరం ప్రాజెక్టులపై ఈ సమీక్షలో ఉన్నతాధికారులతో జగన్ చర్చిస్తారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్రం వద్ద తాము చేసిన ఫిర్యాదులతో పాటు తెలంగాణ అభ్యంతరాలకు కూడా గట్టిగా కౌంటర్లు రెడీ చేయాలని జలవనరులశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఈ భేటీ కీలకంగా మారింది. అవసరమైతే ఈ సమీక్ష తర్వాత సీఎం జగన్ ప్రెస్‌ మీట్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
ahead of crucial apex council meeting in delhi, andhra pradesh chief minister ys jagan has called for a key meeting with water resources department officials tomorrow. in this meeting jagan will chalk out further strategy and how to counter his counterpart kcr also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X