అన్ని వర్గాల వారికి సీఎం జగన్ ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావు : విష్ణు కుమార్ రాజు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస షాకులు ఇస్తున్నారని , కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా సామాన్యులకు ఆయన ఇస్తున్న షాకులు అన్నీ ఇన్నీ కావని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు విమర్శించారు . సీఎం జగన్ వంటి షాకులు ఇచ్చే ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నేటివరకు ఎవరూ లేరని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇలా సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు .

మందుబాబులకు రేట్లు పెంచి షాక్
నేడు మీడియాతో మాట్లాడిన ఆయన మందు బాబులకు రేట్లు పెంచుతూ దిమ్మతిరిగే షాక్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారని పేర్కొన్నారు . మద్యం కొనుగోలు ఎక్కువ మంది చెయ్యకుండా ఉండేలా విపరీతంగా ధరలు పెంచామని చెప్తున్న సర్కార్ లిక్కర్ అలవాటు ఉన్న పేదలకు కూడా షాక్ ఇచ్చారని పేర్కొన్నారు . ఇక అక్కడికే ఆగలేదని ప్రభుత్వ భూములను అమ్ముతూ ఇంకో షాక్ ఇచ్చారని పేర్కొన్నారు.

ప్రభుత్వ భూములు నవరత్నాల కోసం అమ్ముతూ ఇంకో షాక్
ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సింది పోయి ఆ భూములను సర్కారే అమ్ముకోవడం అత్యంత హేయమైన చర్య అని విష్ణు కుమార్ రాజు అన్నారు. నవరత్నాల కోసం ఆ భూములు అమ్మే కార్యక్రమం చేపట్టారని ఆయన విమర్శలు గుప్పించారు .ఇక అసలే కరోనా కష్టకాలంలో పనుల్లేక , తినటానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి కరెంట్ షాక్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు . ప్రతి ఒక్కరూ కరెంట్ బిల్లుల ధాటికి విలవిల లాడుతున్నారని , అలాంటిది 500 యూనిట్లు దాటిన తర్వాత 90 పైసలు రేటు పెంచి షాక్ ఇచ్చిన ఘనత కూడా సీఎం జగన్‌దేనని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.
Recommended Video

సామాన్యులకు అడుగడుగునా షాక్
ఇక పేదలకు భోజనం అందించే క్యాంటిన్లు మూసివేశారని , కనీసం జగనన్న క్యాంటిన్లు అయినా నడిపిస్తే బాగుండేది కానీ అదీ లేకుండా నిరుపేదలకు తిండి కూడా దొరకకుండా చేసి షాక్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు . ఇక ఆటో కార్మికులకు రూ. 10 వేలు ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత పోలీసులచేత వారిపై కేసులు బుక్ చేసి వారి వద్ద నుండి ఫైన్ లు వసూలు చేస్తూ షాకులిస్తున్నారని విష్ణు కుమార్ రాజు ఆరోపించారు. కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ,సామాన్య ప్రజలు ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ షాకులు ఇవ్వగల వ్యక్తి ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.
-
పాదయాత్ర 2.0 పై మారిన జగన్ ఆలోచన, పార్టీ ప్లీనరీ అక్కడే..!! -
జగన్ పై అటాక్ కు కాదేదీ అనర్హం ? తండ్రి పాదయాత్రనూ వాడేస్తున్న షర్మిల..! -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?












Click it and Unblock the Notifications