విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో డిసెంబర్ 1 నుండి బియ్యం డోర్ డెలివరీ .. బియ్యం వద్దంటే నేరుగా డబ్బులు

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం మరొక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నాణ్యమైన బియ్యం పంపిణీ పై మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులను ఆమోదించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు డిసెంబర్ 1వ తేదీ నుండి నాణ్యమైన బియ్యాన్ని ఇంటికే పంపిణీ చేయడానికి సర్కారు నిర్ణయించింది. బియ్యం వద్దంటే వాటికి బదులు డబ్బులు ఇవ్వాలని భావిస్తోంది .

టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న కీలక నేత .. జగన్ సమక్షంలో చేరిక టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న కీలక నేత .. జగన్ సమక్షంలో చేరిక

డిసెంబర్ 1వ తేదీ నుండి బియ్యం డోర్ డెలివరీ

డిసెంబర్ 1వ తేదీ నుండి బియ్యం డోర్ డెలివరీ

రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యాన్ని ఇంటింటికి డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుండి ఆ కార్యక్రమాన్ని చేపట్టేలా నిర్ణయం తీసుకుంది. బియ్యం డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం 9260 ప్రత్యేకమైన వాహనాలను వినియోగించనుంది.

బియ్యం సరఫరాకు ప్రభుత్వం రీ యూజబుల్ సంచులు పంపిణీ చేయనుంది. అంతేకాదు బియ్యం డోర్ డెలివరీ చేసే వాహనాల విషయంలో కూడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

వాహనాల ద్వారా బియ్యం సరఫరా .. యువతకు ఉపాధి మార్గం

వాహనాల ద్వారా బియ్యం సరఫరా .. యువతకు ఉపాధి మార్గం

వాహనాల ద్వారా డోర్ డెలివరీ చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడానికి నిర్ణయించింది. వాహనాలను కొనుగోలు చేసేందుకు 60 శాతం సబ్సిడీని, 30 శాతం లోన్ సౌకర్యాన్ని కల్పిస్తూ కేవలం 10 శాతం మాత్రమే వారు డబ్బు కట్టేలా నిర్ణయం తీసుకుంది. ఇక 30 శాతం బ్యాంకు లోన్ కు సివిల్ సప్లై శాఖ హామీ ఇస్తుంది. ఈ లోను గరిష్టంగా ఆరేళ్లలోపు తీర్చేస్తే వాహనం సదరు వ్యక్తి సొంతమౌతుంది. వాహనాన్ని సదరు వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆలోచన ద్వారా ఖాళీగా ఉన్న యువతకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

బియ్యం వద్దనుకుంటే నేరుగా డబ్బులు ఖాతాలో

బియ్యం వద్దనుకుంటే నేరుగా డబ్బులు ఖాతాలో

అంతేకాదు ప్రభుత్వం సప్లై చేసే నాణ్యమైన బియ్యం వద్దు అనుకుంటే అలాంటివారికి డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. చాలామంది ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని తినలేక తిరిగి వాటిని అమ్మి సన్న బియ్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా బియ్యం వద్దనుకుంటే వారికి డబ్బులు ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించిందని సమాచారం . ప్రస్తుతం బియ్యాన్ని ప్రభుత్వం 25 రూపాయలతో కొనుగోలు చేస్తుండగా, డబ్బులు కావాలి అనుకునే వారికి అకౌంట్లో 30 రూపాయల చొప్పున నగదు బదిలీ చేసేలా ఆలోచన చేస్తుంది.

Recommended Video

Sushant Singh Rajput : I Didn’t Touch Sushant’s Money - Rhea To ED || Oneindia Telugu
సంక్షేమ పథకాలను పేదలకు అందించటంలో సీఎం జగన్ సంస్కరణలు

సంక్షేమ పథకాలను పేదలకు అందించటంలో సీఎం జగన్ సంస్కరణలు

ఏది ఏమైనా ప్రతి శాఖలోనూ ఉన్న లోటుపాట్లను సరి దిద్దుతూ, పేదలకు అందే సంక్షేమ పథకాల విషయంలో, వారికి ప్రయోజనకరంగా ఉండేలా మలుస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే గ్రామ గ్రామాన పేదల కోసం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్ని అవసరాలను గుర్తించి వారికి సేవలను అందిస్తున్నారు . బియ్యం కార్డు , పించన్ కార్డు ఇలా ఏది లేకున్నా వారం రోజుల్లోనే ఇచ్చేలా ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ పని చేస్తుంది.

English summary
The AP government has embarked on another massive program. The AP government has good news for ration card holders in Andhra Pradesh. The government has issued orders to this effect approving the recommendations of the Cabinet Sub-Committee on Distribution of Quality Rice. The government has decided to distribute quality rice to the poor from December 1. If they don't want to take rice they are planning to give them money instead of rice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X