• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీయం ఏక్ నంబ‌రీ..మంత్రి ద‌స్ నంబ‌రీ : ఏపిలో ప్ర‌భుత్వ పెద్ద‌ల తీరు..!

|

య‌ధా త‌ధా..మంత్రి ..ఇదీ ఏపి ప్ర‌భుత్వంలో ఇప్పుడున్న ప‌రిస్థితి. ముఖ్య‌మంత్రి మ‌హిళ‌ను ఉద్దేశించి ఫినిష్ అయిపో తార‌ని హెచ్చ‌రిస్తుంటే..మంత్రి..వితంతువుల‌ను ఉద్దేశించి దుక్క‌లాగ ఉన్నారు..పెన్ష‌న్ కావాలా అని అస‌హ్యంగా మా ట్లాడుతారు. ఇక‌, విప్ గా ఉన్న చింత‌మేని లాంటి వారి సంగేతి స‌రే స‌రే. ఇదే స‌మ‌యంలో..కాల్ మ‌నీ వ్య‌వ‌హారాన్ని వైసిపి నేత‌లు గుర్తు చేస్తున్నారు...దీంతో..ఇప్పుడు సీయం ఏక్ నంబ‌రీ..మంత్రి ద‌స్ నంబ‌రీ అంటూ ..విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి....

ముఖ్య‌మంత్రి తీరు ఇలాగేనా...!

ముఖ్య‌మంత్రి తీరు ఇలాగేనా...!

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నోరు జారుతున్నారు. 2014 లో ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ఆయ‌న ప‌లు సంద ర్భాల్లో నోరు జారి విమర్శ‌ల పాల‌య్యారు. ఏపికి ప్ర‌త్యేక హోదా విష‌యం పై మాట్లాడుతూ..ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా కోడుల మ‌గ బిడ్డ‌ను క‌నిస్తానంటే..అత్త వ‌ద్దంటుందా అని ప్ర‌యోగించిన సామెత ఆయ‌న పై విమ‌ర్శ‌లు వాన‌కు కార‌ణం గా నిలిచింది. అదే విధంగా..ఎవ‌రూ ఎస్సీలో పుట్టాల‌ని కోరుకొని పుడ‌తారా అని గ‌తంలో ప్ర‌శ్నించారు. దీని పైనా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అయింది.

నేను వేయించిన రోడ్ల మీద న‌డుస్తూ

నేను వేయించిన రోడ్ల మీద న‌డుస్తూ

ఇక‌, సింగ‌పూర్ - చైనా- జ‌పాన్ నిర్మాణ రంగాలోని వారిని ప్ర‌శంసిస్తూ..మ‌న దేశంలో వారికి ఈ ప్రాజెక్టులు అప్ప‌గిస్తే..ఏం క‌డ‌తారు...అని ఎద్దేవా చేసారు. ఇక‌, నంద్యాల ఎన్నిక‌ల ప్ర‌చార స‌మంయ‌లో నేను వేయించిన రోడ్ల మీద న‌డుస్తూ..నాకే ఓట్లు వేయ‌రా అంటూ వ్యాఖ్యానించారు. ఇక‌, నాయీ బ్రాహ్మ‌ణులు స‌చివాల‌యం లో ముఖ్య‌మంత్రిని క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్న స‌మ‌యంలోనూ సీయం వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదాస్ప‌దం అయింది. ఇక‌, తాజాగా.. బిజెపి మ‌హిళా కార్య‌క‌ర్త‌లు సీయం ను అడ్డుకున్న సంద‌ర్బంలో మోదీ పై ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శి స్తూనే..వారి పై కోపం తో ఊగిపోయారు. మీరు ఫినిష్ అయిపోతారంటూ సీరియ‌స్ గా వ్యాఖ్యానించారు. ఇప్పుడు సీయం చేస్తున్న వ్యాఖ్య‌లు ఎందుకు చేస్తున్నారో కానీ...సీయం స్థాయిలో ఉండి చేయ‌టం స‌రి కాద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవు తోంది. దీని పై టిడిపి నేత‌లు స‌మాధానం చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

మంత్రుల‌దీ అదే దారి..

మంత్రుల‌దీ అదే దారి..

ఇక‌, ముఖ్య‌మంత్రి తీరు ఇలా ఉంటే..మంత్రులూ ఆదే దారిలో ప‌య‌ణిస్తున్నారు. తాజాగా మంత్రి అయ్య‌న్న పాత్రుడు జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో భాగంగా.. కొంద‌రు వితంతువులు పెన్ష‌న్ కోసం విజ్ఞ‌ప్తి చేసారు.ఆ స‌మంయ‌లో మంత్రి స‌హ నం కోల్పోయి మాట్లాడారు. ద‌క్క‌ల్లా ఉన్నారు..మీకు పెన్ష‌న్లు ఎలా ఇస్తార‌ని వ్యాఖ్యానించారు. భ‌ర్త ఉన్నారా అంటే చె ప్ప‌ర‌ని.. మీరు భ‌ర్త‌ల‌ను రాచి రంపాన పెట్ట‌టం వ‌ల‌నే వారు పారిపోయారంటూ దిగ‌జారి వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు మీడియా లో రిపోర్ట్ అయింది. ఇక‌, విప్ చింత‌మనేని ప్ర‌భాక‌ర్ ఎమ్మార్వో వ‌న‌జాక్షి పై చేసిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. విజ‌య‌వాడ కేంద్రంగా సాగిన కాల్ మ‌నీ దందాలో మ‌హిళ‌లే బాధితుల‌య్యారు. అందులోనూ టిడిపి నేత ల ప్ర‌మేయం పై ఆరోప‌ణ‌లు వెల్లు వెత్తాయి. ఈ ర‌కంగా..ఏపిలోని ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి..మంత్రులు చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి.

English summary
AP Ministers loosing their tongue on many issues. C.M Chandra Babu also controversy comments on agitators form BJP in Kakinada. Minister Ayyanna Patrudu abused widows in Janmabhoomi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X