ఓ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్ .. నూజివీడులో టెన్షన్

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కానీ కరోనా వైరస్ మాత్రం చాప కింద నీరులా విస్తరిస్తోంది . కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఢిల్లీ మర్కజ్ తబ్లీఘీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారికి ఎక్కువగా కరోనా సోకటంతో ఆ చైన్ బ్రేక్ చెయ్యటానికి అధికార యంత్రాంగం ప్రయత్నం సాగిస్తుంది.కానీ ఇంకా ఆ చైన్ బ్రేక్ కాలేదేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .

ప్రజలంతా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కరోనా నియంత్రణకు ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. అయితే ఇదిలా ఉండగా కృష్ణా జిల్లాలోని నూజివీడులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్థారణ అయిందని వైద్యులు తెలిపారు. అయితే వీరికి కరోనా పాజిటివ్ ఎలా వచ్చింది. ఎవరి ద్వారా సోకింది. ఇంకా ఎవరైనా వీళ్ళలో తబ్లీఘీ జమాత్ కు వెళ్ళిన వారు ఉన్నారా ? అన్న కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు .

Corona positive for two young men attended a funeral.. tension in nuziveedu

కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి నూజివీడు వెళ్లిందా! అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వెలుగు చూసిన సంఘటనలతో , పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఈ అనుమానం మొదలైంది. ఇప్పటిదాకా నూజివీడు పట్టణానికి పరిమితమైన కేసులు ఇప్పుడు గ్రామాలకు పాకడం ఆందోళనకరంగా మారింది. ఒకరి నుండి ఒకరికి ప్రైమరీ కాంటాక్ట్ కూడా తెలీకుండా కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో నమోదవుతున్న కేసులు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. నూజివీడు వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+