• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వెంటాడుతున్న జ‌గ‌న్‌: చ‌ంద్రబాబు ఇంటి గోడ‌లపై నోటీసులు..ఖాళీ చేయండి: బాబు రివ‌ర్స్ ప్లాన్..!

|
  చంద్ర‌బాబు ఇంటికి నోటీసులు అంటించిన CRDA అధికారులు || CRDA Officers Issued Notices To Chandrababu

  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెనుక‌డుగు వేయ‌టం లేదు. ప్ర‌జావేదిక కూల్చేసిన ప్ర‌భుత్వం ఇప్పుడు క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మ నిర్మాణాల‌ను ల‌క్ష్యంగా చేసుకుంది. అందులో ముందుగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్‌ను ఎంచుకున్నారు. చంద్ర‌బాబుకు నోటీసులు ఇవ్వ‌టంతో పాటుగా ఆయ‌న ఇంటి గోడ‌ల పైనా వాటిని అతికించారు. స‌మాధానం కోసం వారం రోజుల గ‌డువు ఇచ్చారు. మ‌రి..చంద్ర‌బాబు ఏం చేస్తారు. చూస్తూ ఉరు కుంటారా..లేక బాబు సైతం పొలిటిక‌ల్ గేమ్ మొద‌లు పెడతారా..ఎవ‌రికి లాభం..ఎవ‌రికి న‌ష్టం..

  చంద్ర‌బాబుకు సీఆర్డీఏ నోటీసులు..

  క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మంగా నిర్మాణం చేసిన లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్‌లో ఉంటున్న చంద్ర‌బాబు కు ఊహించిన విధంగానే సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసారు. అక్ర‌మ నిర్మాణంలో ఉంటున్నార‌ని దీనికి వారంలోగా ఖాళీ చేయాల‌ని ..అదే విధంగా నిర్మానం ప‌డ‌గొట్టాల‌ని ఆ నోటీసులో పేర్కొన్నారు. లేని ప‌క్షంలో ప్ర‌భుత్వ‌మే ఆ ప‌ని చేస్తుంద‌ని స్ప‌ష్టం చేస్తూ నోటీసు జారీ చేసారు. దీనికి సంబంధించి వారం రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసు జారీ చేసేందుకు టీడీపీ అధినేత నివాసానికి వ‌చ్చిన సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి స్ప‌ష్టం చేసారు. 2015 నుండి ఈ నివాసంలో ఉంటున్న చంద్ర‌బాబు ప్రభుత్వ నిధులతో ఆ భవనాన్ని సర్వాంగ సుందరం గా తీర్చిదిద్దారు. జీ+1 భవనంలో అత్యా ధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. చంద్ర‌బాబు ఆ ఇంటి య‌జ‌మాని కాద‌ని..అద్దెకు మాత్రమే ఉంటున్నార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఆ ఇంటి వ్య‌వ‌హారం కోర్టులో ఉంద‌ని గుర్తు చేస్తున్నారు.

  వెంటాడుతున్న జ‌గ‌న్..

  వెంటాడుతున్న జ‌గ‌న్..

  క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మ నిర్మాణాల మీద ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యం నుండి జ‌గ‌న్ ప‌లు మార్లు చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుంటూ ఆరోప‌ణ‌లు చేసారు. ఇక‌, ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలుత ప్ర‌జా వేదిక‌ను కూల్చాల‌ని ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయంగా పెద్ద ఎత్తున ఈ నిర్ణ‌యం పైన దుమారం చెల‌రేగింది. క‌క్ష్య సాధింపుల్లో భాగంగానే ప్ర‌జా వేదిక‌ను కూల్చేసార‌ని..ఇదే విధంగా మిగిలిన అక్ర‌మ కట్ట‌డాల పైనా వ్య‌వ‌హ‌రిస్తారా అంటూ టీడీపీ నేత‌లు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. క‌ర‌క‌ట్ట మీద దాదాపు 50 నిర్మాణాలు అక్ర‌మంగా నిర్మించార‌ని వాటికి మొత్తానికి నోటీసులు ఇస్తున్నామ‌ని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. అయితే, జ‌గ‌న్ మాత్రం ఎవ‌రి విష‌యంలో నూ ఉపేక్షించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసారు. ప్ర‌జావేదిక‌..ఆ త‌రువాత ఇప్పుడు చంద్రబాబు నివాసానికి ఏకంగా నోటీసులు ఇవ్వ‌టం..వారం రోజులే స‌మ‌యం ఇవ్వ‌టంతో జ‌గ‌న్ ఈ విష‌యంలో వెన‌క‌డుగు వేసే ఉద్దేశంలో లేర‌ని..వెంటాడుతూనే ఉంటారనే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది.

  చంద్ర‌బాబు రివ‌ర్స్ ప్లాన్‌..

  చంద్ర‌బాబు రివ‌ర్స్ ప్లాన్‌..

  జ‌గ‌న్ అక్ర‌మ నిర్మాణాల పైన క‌ఠినంగా వ్య‌వ‌హరించ‌టం ద్వారా ఇమేజ్ పెరుగుతుంద‌నే అంచ‌నాలో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు సైతం దీని ద్వారా పొలిటిక‌ల్ మైలేజ్ సాధించే విధంగా వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. తాజాగా పార్టీ నేత‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలోనూ ఇదే అంశం పైన చ‌ర్చించారు. తాను నివాసం ఉంటున్న ఇంటి వ్వ‌వ‌హారం కోర్టు ప‌రిధిలో ఉంద‌ని..దీని పైన ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకొనే అవ‌కాశం లేద‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం త‌న నివాసం కూల్చేయ‌టానికి ముందుకు వ‌స్తే ఆహ్వానిద్దామ‌ని..దీనిని ప్ర‌జ‌ల్లోకి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌గా తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌త్యామ్నాయంగా మ‌రో ఇంటిని చూద్దామ‌ని..అందులో చంద్ర‌బాబు ఉండ‌టానికి అన్ని ఏర్పాట్లు చేద్దామ‌ని నేత‌లు ప్ర‌తిపాదించినా చంద్ర‌బాబు వారించారు. ప్ర‌భుత్వం ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుందో చూసి మందుకు వెళ్దామ‌ని చెప్పుకొచ్చారు. దీని ద్వారా ప్ర‌జ‌ల్లో త‌న పైన జ‌గ‌న్ క‌క్ష్యా సాధింపు కు దిగుతున్నార‌ని..త‌న ఇంటిని కూడా కూల్చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే సానుభూతి పొంద‌టానికి చంద్ర‌బాబు కొత్త వ్యూహం అమ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి..ఈ వ్య‌వ‌హారంలో జ‌గ‌న్‌..చంద్ర‌బాబు ఈ ఇద్ద‌రిలో ఎవ‌రికి ఇమేజ్ ద‌క్కుతుందో..డామేజ్ అయ్యేది ఎవ‌రో చూడాలి.

  English summary
  CRDA officers issued to notices to Chandra babu on encroach of Krishna river sides. In that notices officers given one week time for reply. If house owner can not demolish this construction then govt may take initiate.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X