విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్.. బాబులా కాదు.. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే.. అనంతబాబు ఇష్యూపై మంత్రి అంబటి

|
Google Oneindia TeluguNews

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్మహ్మణ్యం హత్య కేసుపై రాజకీయ దుమారం నెలకొంది. వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ లీడర్స్ కామెంట్ చేస్తున్నారు. దీనికి అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. ఎమ్మెల్సీ అనంత బాబును కాపాడే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్సీ అయినా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు.

72 గంటలు అవుతున్నా...?

72 గంటలు అవుతున్నా...?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. అనంత బాబే తన డ్రైవర్‌ను హత్య చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కేసు రిజిస్టర్ అయి 72 గంటలు కావస్తున్నా ఎమ్మెల్సీ అనంత బాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు.

రూల్ ఆఫ్ లా..

రూల్ ఆఫ్ లా..


చట్టానికి అందరూ సమానమే, విచారణ జరపాలని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. హత్య చేసినట్టు ఎమ్మెల్సీ అనంత బాబుపై అభియోగాలు వచ్చాయని.. సెక్షన్ 302, అట్రాసిటీ కేసులు నమోదు చేశారని వివరించారు. తప్పు చేస్తే తప్పించాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదని మంత్రి తేల్చి చెప్పారు. చంద్రబాబు మాదిరిగా తప్పు చేసినా కాపాడే తత్వం జగన్‌ది కాదన్నారు. అనంతబాబును అరెస్ట్ చేస్తుంటే ఇక సస్పెండ్ ఎందుకు? అని మంత్రి ప్రశ్నించారు. సస్పెండ్ పై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

జోక్యం చేసుకోవడంతో..

జోక్యం చేసుకోవడంతో..


తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకోవడంతో తానే హత్య చేసినట్లు అనంతబాబు ఒప్పుకున్నడట. తాను హత్య చేయాలని భావించలేదని.. బెదిరించి వదిలేద్దామనుకున్నట్లు అనంతబాబు పోలీసులతో చెప్పారట. హత్యకు గురైన సుబ్రహ్మణ్యం.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేసి కొద్ది నెలల క్రితం మానేశాడు. గురువారం రాత్రి సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదంలో సుబ్రమణ్యం చనిపోయాడని సోదరుడికి స్వయంగా ఎమ్మెల్సీ ఫోన్ చేసి చెప్పారు. కొద్దిసేపటికి సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని కారులో ఇంటి దగ్గరకు తీసుకొచ్చారు. సుబ్రమణ్యంను విగతజీవిగా చూసి కుటుంబసభ్యులు షాక్ తిన్నారు.

హైడ్రామా..

హైడ్రామా..


సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై రోజంతా పెద్ద హైడ్రామా నడిచింది. ముందు పోస్ట్‌మార్టంకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తర్వాత పోలీసులు వారిని ఒప్పించడంతో పోస్టుమార్టం నిర్వహించి రిపోర్ట్ అందజేశారు. అందులో సుబ్రహ్మణ్యంది హత్యగా తేలగా.. అతడిని కొట్టడంతోనే చనిపోయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో ప్రస్తావించారు. దాడి చేయడంతో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఆ తర్వాత అనంతబాబుపై కేసు నమోదైంది.

English summary
culprit must punished in jagan rule minister ambati rambabu on mlc anantha babu issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X