విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైలు నుండి దేవినేని ఉమా విడుదల ; కుట్రలకు భయపడం, అక్రమ నిర్బంధాలతో ఆపలేరని ధ్వజం !!

|
Google Oneindia TeluguNews

టిడిపి సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి దేవినేని ఉమా ఎట్టకేలకు బయటకు వచ్చారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని అడ్డుకోవడానికి వెళ్ళిన దేవినేని ఉమా పై పలువురు దాడి చేసిన ఘటన రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టించిన విషయం తెలిసిందే. కొండపల్లిలో మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిన దేవినేని ఉమా పోలీసులను దూషించారని, ఎస్సీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తో పాటుగా, హత్యాయత్నం కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవినేని ఉమాకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు.

కుట్రలు కుతంత్రాలకు భయపడేది లేదన్న దేవినేని ఉమా

కుట్రలు కుతంత్రాలకు భయపడేది లేదన్న దేవినేని ఉమా

తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ దేవినేని ఉమ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ ఉన్నత న్యాయస్థానం దేవినేని ఉమాకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దేవినేని ఉమా కు హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో రాజమహేంద్ర జైలు నుంచి ఆయనను విడుదల చేశారు. దేవినేని ఉమ విడుదల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా పలు కీలక వ్యాఖ్యలు చేశారు . రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల తర్వాత మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా భయపడబోమని తేల్చిచెప్పారు.

కుట్రలు చేసినా న్యాయదేవత అనుగ్రహంతో విడుదలయ్యానని స్పష్టం

కుట్రలు చేసినా న్యాయదేవత అనుగ్రహంతో విడుదలయ్యానని స్పష్టం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తనకు మద్దతు ఇచ్చారని, ధైర్యం చెప్పారని దేవినేని ఉమా ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకుంటే అరెస్ట్ చేశారని, తనపై దాడి జరిగిన సమయంలో పోలీసులు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారని దేవినేని ఉమ స్పష్టం చేశారు. దాడి జరిగిన సమయంలో తాను దాదాపు ఎనిమిది గంటలపాటు కారులోనే ఉండిపోయానని ఆయన పేర్కొన్నారు. కనీసం కారు దిగి బయటకు రాలేదని చెప్పిన దేవినేని ఉమా తనపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తుంటే దాడి చేయడమే కాదు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఉమా అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని, ధర్మాన్ని కాపాడుతున్నాయని పేర్కొన్న దేవినేని ఉమా ప్రభుత్వం కుట్రలు చేసిన న్యాయ దేవత అనుగ్రహంతో విడుదలయ్యానని చెప్పారు. అక్రమ నిర్బంధంతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

 కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ గ్రావెల్ తరలింపు .. సీన్ లోకి దేవినేని

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ గ్రావెల్ తరలింపు .. సీన్ లోకి దేవినేని

కృష్ణా జిల్లా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ గ్రావెల్ తరలింపు జరుగుతుందని నిజనిర్ధారణ కోసం అక్కడికి వెళ్ళిన దేవినేని ఉమా పై వైసీపీ నేతలు దాడికి దిగారని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారని టిడిపి నేతలు విమర్శించారు. అయితే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన ఘటనపై పోలీసులు దేవినేని ఉమా పైన కేసు నమోదు చేయడం గమనార్హం. దేవినేని ఉమా పోలీసులపై దుర్భాషలాడారని, అక్కడ ఉన్న ఎస్సీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆతర్వాత దేవినేని ఉమాను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఫైనల్ గా దేవినేని ఉమాను కోర్టుకు హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో దేవినేని ఉమాకు ప్రాణహాని ఉందన్న టీడీపీ

రాజమండ్రి సెంట్రల్ జైల్లో దేవినేని ఉమాకు ప్రాణహాని ఉందన్న టీడీపీ

దేవినేని ఉమా ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ ను బదిలీ చేయడంతో దేవినేని ఉమా రక్షణపై టిడిపి నేతలు భగ్గుమన్నారు. దేవినేని ఉమకు ప్రాణహాని ఉందని టిడిపి నాయకులు నిప్పులు చెరిగారు. దేవినేని ఉమ పైన దాడి చేసి, దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా, దేవినేని ఉమ పై కేసులు పెట్టడాన్ని టిడిపి తీవ్రంగా తప్పు పట్టింది. జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దేవినేని ఉమా పై తప్పుడు కేసులు పెట్టారని టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవినేని ఉమా అరాచకాలతో ప్రజలు తిరగబడ్డారన్న వైసీపీ నేతల రివర్స్ ఎటాక్

దేవినేని ఉమా అరాచకాలతో ప్రజలు తిరగబడ్డారన్న వైసీపీ నేతల రివర్స్ ఎటాక్


వైసీపీ నేతలు టీడీపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా అరాచకాలతో ప్రజలే తిరగబడ్డారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. పోలీసులను దేవినేని ఉమా బెదిరించారని, గ్రామస్తులను కావాలనే దేవినేని ఉమా రెచ్చగొట్టారని ఆరోపించారు కొడాలి నాని. పోలీసులను దేవినేని ఉమ ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారని, దళితులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారని కొడాలి నాని స్పష్టం చేశారు. దేవినేని ఉమాపై గ్రామస్తులు దాడి చేయడానికి కారణం అదేనని పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మాటల యుద్ధంతో అక్రమ మైనింగ్ పై రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ కొనసాగుతూనే ఉంది.

 ఫ్యామిలీకి ధైర్యం చెప్పిన టీడీపీ అధినేత .. ఇంట్రెస్టింగ్ గా దేవినేని ఎపిసోడ్

ఫ్యామిలీకి ధైర్యం చెప్పిన టీడీపీ అధినేత .. ఇంట్రెస్టింగ్ గా దేవినేని ఎపిసోడ్

ఇక చంద్రబాబు నాయుడు గొల్లపూడి వెళ్లి దేవినేని కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అరెస్టులతో నిర్బంధాల తో తమను బెదిరించ లేరని వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. టిడిపి తో పెట్టుకుంటే చరిత్రలో లేకుండా పోతారని విమర్శించారు. ప్రస్తుతం దేవినేని ఉమా బయటకు రావడంతో, ఈ వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతుంది అనేది ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

English summary
Devineni uma has said he doesn't care about the The YCP government conspiracies. Devineni Uma said that TDP chief Chandrababu Naidu and TDP state president Atchannaidu had given him support and courage. Devineni Uma clarified that he was arrested for obstructing illegal gravel excavations and that the police were two kilometers away at the time of the attack on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X